Sircilla Textile Industry: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వస్త్ర పరిశ్రమ బంద్ మూడవ రోజుకు చేరుకుంది. పవర్లూమ్స్ కు ఆర్డర్లు అందడం లేదని అందుకే నిరవధికంగా బంద్ చేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. టెక్స్ టై ల్ పార్కులో వస్త్రోత్పత్తిని యజమానులు ప్రారంభిస్తామని అంటున్నారు. చర్చల అనంతరమే కార్మికులు పనిలోకి వెళ్ళాలనే కార్మిక సంఘాల నాయకులు ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ సోమవారం నుంచి నిరవధికంగా మూతపడిన విషయం తెలిసిందే.. దేశవ్యాప్తంగా టెక్స్‌టైల్ పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం, కొత్త ఆర్డర్లు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యజమానులు ప్రకటించారు. గోడౌన్లలో ఇప్పటికే లక్షల మీటర్ల వస్త్రం పేరుకుపోయిందని, పాలిస్టర్ యజమానులు కొత్త నూలు కొనుగోలు చేసి ఉత్పత్తి కొనసాగించే పరిస్థితి లేదని నేతన్నలు వెల్లడించారు. గతంలో ఉత్పత్తి చేసిన వస్త్రాల తాలూకు బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాకపోవడంతో కొత్త పెట్టుబడులు పెట్టలేకపోతున్నట్లు ప్రకటించారు. సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ బంద్ నిర్ణయంతో వేలాది మంది పవర్లూమ్, నేత కార్మికులు ఉపాధి కోల్పోనున్నారు.
Read also: Husband Killed His Wife: భార్య పై అనుమానం.. తల నరికేసిన భర్త..!
ఇప్పటికే బతకమ్మ చీరల ఆర్డర్ ముగిసినప్పటి నుంచి సిరిసిల్లలో పవర్‌లూమ్ పరిశ్రమ మందకొడిగా సాగుతోంది. పరిశ్రమలో పని లేక కూలీలకు ఉపాధి దొరకడం లేదు. ఈ నేపథ్యంలో వస్త్ర పరిశ్రమ సంక్షోభం పేరుతో పాలిస్టర్ యాజమాన్యాలు తీసుకున్న నిర్ణయం పరిశ్రమపై ఆధారపడిన పవర్లూమ్ కార్మికుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.సిరిసిల్ల పవర్లూమ్ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వులు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు ప్రకటించినప్పటికీ ఉత్తర్వులపై అనిశ్చితి కొనసాగుతోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని పరిశ్రమల యాజమాన్యాలు తెలిపాయి. మరోవైపు కేవలం 600లోపు మగ్గాలున్న టెక్స్‌టైల్ పార్కుకు, 25,000 మగ్గాలు అంతకు మించి ఉన్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సమాన ఆర్డర్లు ఇస్తామని అధికారులు చెప్పడంపై సిరిసిల్ల పట్టణ పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ యజమానులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోతే పరిశ్రమలు నడపలేమని యాజమాన్యాలు స్పష్టం చేశాయి. అయితే టెక్స్ టై ల్ పార్కులో వస్త్రోత్పత్తిని ప్రారంభిస్తామని యాజమాన్యం ప్రకటించినా చర్చల తరువాతే ఏదైనా అని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి.
Kishan Reddy: బషీర్ బాగ్ ఆలయంలో స్వచ్ఛత కార్యక్రమం.. పాల్గొన్న కిషన్ రెడ్డి