Telugu Girl Susroonya Koduru health Critical: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని లా పోర్టేలోని శాన్ జాసింటో మాన్యుమెంట్ వద్ద పిడుగుపాటుకు గురై అమెరికాలో చదువుకుని అక్కడే సెటిల్ అవ్వాలని వెళ్లిన భారతదేశానికి చెందిన 25 ఏళ్ల తెలుగు విద్యార్థిని సుస్రూణ్య కోడూరు తీవ్రంగా గాయపడింది. శాన్ జాసింటో మాన్యుమెంట్ పార్క్‌లోని చెరువు వద్ద షికారు చేస్తుండగా పిడుగు పడడంతో సుస్రూణ్యకు తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. పిడుగుపాటుకు గురై సుస్రూణ్య గాయపడి పక్కనే ఉన్న ఒక చెరువులో…
90 Years Old Women Melba Mebane retires after 74 years having never missed a single day of duty: ప్రస్తుతం ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరు ఎప్పుడు ‘లీవ్’ పెడదామా? అని చూస్తుంటారు. అందుకు ఉన్న కారణాలన్నింటిని వెతుకుతుంటారు. దగ్గు, జలుబు అంటూ.. చిన్న సమస్యకు కూడా సెలవులు పెట్టేస్తుంటారు. అయితే ఓ బామ్మ మాత్రం ఏకంగా 74 ఏళ్ల పాటు లీవ్ పెట్టకుండా జాబ్ చేశారు. 7 దశాబ్దాల పాటు…
Malaria: దోమల ద్వారా సంక్రమించే మలేరియా వ్యాధి అమెరికాను గడగడలాడిస్తోంది. దాదాపుగా 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా యూఎస్ఏలో మలేరియా కేసులు నమోదు అవుతున్నాయి. రెండు నెలల్లో 5 కేసులు నమోదయ్యాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(CDS) ప్రకారం, నాలుగు కేసులు ఫ్లోరిడాలో కనుగొనబడ్డాయి. ఐదో కేసు టెక్సాస్ లో కొనుగొనబడింది. రోగులు విదేశాలకు వెళ్లిన దాఖలాలు లేకపోవడంతో ఈ వ్యాధి స్థానికంగానే సంక్రమించిందని వైద్యాధికారులు తెలిపారు.
టెస్లా అధినేత ఎలన్‌మస్క్ సారధ్యంలోని స్పేస్ ఎక్స్ సంస్థ ప్రయోగించిన అతిపెద్ద రాకెట్ స్టార్‌షిప్ ప్రయోగంలో మరో కీలక అస్ డేట్ వచ్చింది. ఈ ప్రయోగం గతంలో విఫలమైన తరువాత ఎలన్ మస్క్ మరికొద్ది నెలల్లో మరో ప్రయోగం చేపడతామని తెలిపారు. తాజాగా జరిగిన ఫ్లైట్-2 ప్రయోగంలో మరో మైలురాయిని అధిగమించినట్లు తన ట్విట్టర్ ఖాతాలో ఎలన్ మస్క్ పేర్కొన్నాడు.
అమెరికాలో భారత సంతతి మహిళ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. టెక్సాస్ రాష్ట్రంలో ఉంటున్న 25 ఏళ్ల లహరి పతివాడ.. ఐదు రోజుల క్రితం విధులకు వెళ్తూ అదృశ్యమయ్యారు. ఆ మరుసటి రోజే టెక్సాస్‌కు 322 కిలోమీటర్ల దూరంలో ఒక్లహోమా రాష్ట్రంలో శవమై కనిపించారు.
Gun Fire : అమెరికాలో మరోసారి భీకర కాల్పులు జరిగాయి. ఇందులో ఐదుగురు మరణించారు. ఈ ఘటన టెక్సాస్‌లోని క్లీవ్‌ల్యాండ్‌లో చోటుచేసుకుంది. దుండగుడు ఒక కుటుంబాన్ని టార్గెట్ చేశారు.
Texas Gun shooting: అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఓ అఘాంతకుడు 8 ఏళ్ల చిన్నారితో సహా ఐదుగురిని అత్యంత క్రూరంగా కాల్చిచంపాడు. ఈ ఘటన టెక్సాస్‌లోని క్లీవ్‌ల్యాండ్‌లో జరిగింది. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు శాన్ జాసింటో కౌంటీ షెరీఫ్ పోలీసులు శనివారం వెల్లడించారు. శుక్రవారం రాత్రి 11.30 గంటలకు వేధింపులకు సంబంధించి ఓ ఫోన్ కాల్ వచ్చిన తర్వాత, సదరు ప్రాంతానికి పోలీసులు వెళ్లి చూడటంతో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి…
అమెరికాలో కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఆదివారం తెల్లవారుజామున టెక్సాస్‌లోని జాస్పర్‌లో జరిగిన ప్రోమ్ పార్టీలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో తొమ్మిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. హ్యూస్టన్‌కు ఈశాన్యంగా 134 మైళ్ల (215 కి.మీ) దూరంలో దాదాపు 7,200 మంది జనాభా ఉన్న జాస్పర్‌లో ఈ ఘటన జరిగింది.
అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్, లూసియానా రాష్ట్రాలను తీవ్రమైన తుపాను తాకింది. దీంతో కాలిఫోర్నియాలో భారీహా మంచు కురుస్తోంది. మంచు భారీగా కురవడం వల్ల చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Thieves attack Hindu temple in USA: హిందూ ఆలయాలపై విదేశాల్లో దాడులు ఆగడం లేదు. ఇటీవల వారం వ్యవధిలో ఆస్ట్రేలియాలో రెండు దేవాలయాలపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడులు చేశారు. అంతకు ముందు బ్రిటన్, కెనడా దేశాల్లో కూడా ఇలాగే హిందూ దేవాలయాలపై దుండగులు దాడులు చేసిన సంఘటనలు చూశాం. తాజాగా అమెరికాలో ఓ హిందూ దేవాలయంపై దొంగలు దాడి చేసి ఆలయంలోని విలువైన వస్తువులను దోపిడి చేశారు.