Breaking: అమెరికాలో పిడుగుపడి తెలుగమ్మాయికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telugu Girl Susroonya Koduru health Critical: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని లా పోర్టేలోని శాన్ జాసింటో మాన్యుమెంట్ వద్ద పిడుగుపాటుకు గురై అమెరికాలో చదువుకుని అక్కడే సెటిల్ అవ్వాలని వెళ్లిన భారతదేశానికి చెందిన 25 ఏళ్ల తెలుగు విద్యార్థిని సుస్రూణ్య కోడూరు తీవ్రంగా గాయపడింది. శాన్ జాసింటో మాన్యుమెంట్ పార్క్‌లోని చెరువు వద్ద షికారు చేస్తుండగా పిడుగు పడడంతో సుస్రూణ్యకు తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. పిడుగుపాటుకు గురై సుస్రూణ్య గాయపడి పక్కనే ఉన్న ఒక చెరువులో పడింది. వెంటనే ఆ పక్కనే ఉన్న ఒక వ్యక్తి దూకి ఆమెకు సహాయం చేసి ఒడ్డుకు తీసుకొచ్చారు. అయితే ఆమెకు ఫస్ట్ ఎయిడ్ అందించడానికి ప్రయత్నించిన వారు ఆమెకు సీపీఆర్ ఇచ్చారు. అయితే సుస్రూణ్యకు 20 నిమిషాల పాటు గుండె ఆగిపోవడం వల్ల మెదడు తీవ్రంగా దెబ్బ తినడంతో ఆమె కోమాలోకి వెళ్లిందని తెలుస్తోంది.
Adivi Sesh: మళ్లీ డైరెక్షన్ చేయబోతున్న అడివి శేష్?
Also Read
- America : భారతీయుల నెత్తిన మరో భారీ పిడుగు.. ఆందోళనలో లక్షలాది మంది పౌరులు
- ATA Vedukalu 2025: తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున 'ఆటా వేడుకలు'.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
- NRI Arrest: భార్యపై వేధింపులు.. అమెరికాలో తిరుపతికి చెందిన ఎన్నారై అరెస్టు
- Kodela Sivaram : టాంపాలో కొడెల శివరామ్‌తో తెలుగు వారి ఆత్మీయ సమావేశం విజయవంతం
సుస్రూణ్యకు ప్రస్తుతం వెంటిలేటర్ సపోర్ట్ అలాగే ఫీడింగ్ ట్యూబ్ అవసరం అని వైద్యులు తేల్చారు. MRI రిపోర్టుల ప్రకారం ఆమెకు అనాక్సిక్ ఎన్సెఫలోపతి వచ్చిందని అంటున్నారు. ఈ పరిస్థితి మెదడుకు ఎక్కువ కాలం ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ కష్ట సమయంలో తమ కుమార్తెతో కలిసి ఉండాలని అనుకుంటున్నా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సుస్రూణ్య తల్లిదండ్రులకు పలువురు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అత్యవసర వీసాల కోసం తక్షణ ప్రయత్నాలు జరుగుతున్నాయి, సుస్రూణ్య తన మాస్టర్స్ డిగ్రీ చదివి అమెరికాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మరింత ముందుకు వెళ్లాలని కలలు కన్నదని ఆమె స్నేహితులు చెబుతున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థుతుల్లో ఆమెను తిరిగి ఇండియా తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఫండ్ రైజింగ్ జరుగుతోంది.
తాజావార్తలు
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
-
Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!