Hurricane Beryl: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో బెరిల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఈ తుఫాన్ కారణంగా బలమైన గాలులు, కుండపోత వర్షం కురుస్తుండటంతో సోమవారం టెక్సాస్‌లో ముగ్గురు మరణించారు.
టెక్సాస్ సముద్రంలో షార్క్ చేప తీరంలో బీభత్సం సృష్టించింది. బీచ్‌లో స్నానం చేస్తుండగా టూరిస్టులపై ఒక్కసారిగా దాడి చేసింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సహచర పర్యాటకులు సొరచేప నుంచి రక్షించారు.
టెక్సాస్లో ఓ ముష్కరుడి జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. శనివారం సాయంత్రం టెక్సాస్‌లోని రౌండ్ రాక్‌లోని ఒక పార్కులో ఈ ఘటనకు పాల్పడ్డాడు. కాగా.. ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయలయ్యాయి. జునెటీన్త్ పండుగ సందర్భంగా అందరూ సరదాగా గడుపుతున్న సమయంలో ముష్కరుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఇద్దరు పిల్లలతో సహా కనీసం ఆరుగురు గాయపడ్డారని CNN నివేదించింది. గాయపడిన వారందరిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అమెరికాలోని (America) టెక్సాస్‌లో (Texas) కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. 780 కిలోమీటర్ల పరిధిలోని మొత్తం 2 లక్షల ఎకరాల్లో వృక్షాలు కార్చిచ్చుకు ఆహుతయ్యాయని
Woman Fire in Texas Megachurch: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు జరిగాయి. టెక్సాస్ హూస్టన్‌లో ఉన్న మెగాచర్చిలో ఆదివారం ఓ మహిళ తుపాకీతో కాల్పులకు పాల్పడింది. వేంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ మహిళను కాల్చి చంపారు. ఈ ఘటనలో ఐదేళ్ల బాలుడు, 57 ఏళ్ల వ్యక్తి గాయపడ్డారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల వివరాల ప్రకారం… స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఐదేళ్ల బాలుడితో ఓ మహిళ లాక్‌వుడ్…
Anantapur: తెలుగు వైద్యుడు బావికాటి జయరాం నాయుడుకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. వైద్య వృత్తిలో ఆయన చేసిన విశేష సేవలను గుర్తించిన అక్కడి ప్రభుత్వం ఓ వీధికి ఆయన పేరు పెట్టాలని నిర్ణయం తీసుకుంది.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదలో తెలంగాణ యువకుడు మృత్యువాతపడ్డాడు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎంబంజర్‌కు చెందిన ముక్కర భూపాల్ రెడ్డి కుమారుడు సాయిరాజీవ్ రెడ్డి (28) టెక్సాస్‌లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఓ పార్సిల్ తీసుకోవడానికి కారులో విమానాశ్రయానికి వెళ్లి.. తిరిగి వస్తుండగా ఓ ట్రక్కు అదుపు తప్పి కారును ఢీకొట్టింది. సాయిరాజీవ్‌ను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తుండగానే మృతి చెందాడు. Also Read: Gold Price Today :…
5 Telugu Peoples Died In Texas Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టెక్సాస్ నగరంలోని జాన్సన్ కౌంటీ వద్ద జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతులందరూ ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురంకు చెందిన వారు. మృతులు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులు ఉన్నారు. పొన్నాడ సతీష్ చిన్నాన్న నాగేశ్వరరావు కుటుంబసభ్యులుగా పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో పొన్నాడ నాగేశ్వరరావు, ఆయన భార్య సీతామహాలక్ష్మి, కుమార్తె నవీన గంగ,…
క్రిస్మస్ వేళ ఆకాశంలో అద్భుతం సృష్టించారు. నెల రోజుల ముందే అమెరికాలో క్రిస్మస్ వేడుకలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యంలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఒక్కో స్టేట్ ఒక్కోరకంగా క్రిస్మస్ పండుగ ఏర్పాట్లను నిర్వహించారు. ఈ క్రమంలో టెక్సాస్లో డ్రోన్ షోతో పండగకు శోభ తెచ్చారు. టెక్సాస్ ప్రజల విన్నూత్న ప్రదర్శనకు ఏకంగా వరల్డ్ గిన్నిస్ బుక్కే ఫిదా అయ్యింది. అక్కడ నిర్వహించిన 1500 డ్రోన్ల ప్రదర్శన గిన్నిస్ వరల్డ్ రికార్డుకు ఎక్కింది. కాగా గత…
Ghost saves a Teacher: దెయ్యాలు నిజంగా ఉంటాయో లేదో తెలియదు కానీ అవి అంటే మాత్రం అందరికీ భయమే. అయితే ఇవి ఉన్నయా లేవా అనే ప్రశ్నకు ఇప్పటి వరకు ఆధారాలతో ఎటువంటి సమాధానం దొరకలేదు. అయితే కొందరు దెయ్యాలని చూశామని అవి అలా చేశాయి ఇలా చేశాయి అని చెబుతూ ఉంటారు కానీ వాటికి సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవు. కొందరు అవి ఉన్నాయని నమ్ముతుంటే కొందరు మాత్రం అవన్నీ మూఢనమ్మకాలని కొట్టిపారేస్తుంటారు. అదంతా…