IND vs ENG Test: లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు తడబడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కీలకమైన 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది టీమిండియా.
ఇండియా, ఇంగ్లాండ్ మధ్య అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లో రెండవ మ్యాచ్ బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరుగుతోంది. నేడు (జూలై 6) ఈ మ్యాచ్‌లో చివరి రోజు. ఈరోజు, ఇంగ్లాండ్ తన రెండవ ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 72 పరుగుల వద్ద ఆడుతోంది. ఓల్లీ పోప్ 24 పరుగులు, హ్యారీ బ్రూక్ 15 పరుగులతో నాటౌట్‌గా కొనసాగుతున్నారు. ఈ మ్యాచ్‌లో, భారత జట్టు ఇంగ్లాండ్‌కు 608 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండానే ఈ సారి టీమిండియా ఇంగ్లాండ్ లో పర్యటించనుంది. ఈ సీనియర్ ఆటగాళ్లు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో సెలక్టర్లకు జట్టు కూర్పు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా కెప్టెన్‌పై సెలెక్టర్లు ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఇదిలా ఉంటే.. సీనియర్లు లేని జట్టులో మరో ఇద్దరు సీనియర్లు జట్టుకు దూరం కానున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు మహ్మద్ షమీ దూరం అయ్యే అవకాశముంది.