Pakistan : పాకిస్థాన్‌లో ప్రతిరోజూ ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు మరోసారి బుధవారం రాత్రి గ్వాదర్‌లో ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు కార్మికులు మరణించారు.
సూరన్ కోట్ ప్రాంతంలో ఇటీవల వాయుసేన కాన్వాయ్ పై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఉగ్రవాదులు ఏకే అసాల్ట్ రైఫిల్స్‌తో పాటు అమెరికాలో తయారు చేసిన ఎం4 కార్బైన్‌లు, స్టీల్ బుల్లెట్‌లను కూడా ఉపయోగించి గరిష్ఠంగా ప్రాణనష్టం చేసేందుకు ప్రయత్నించినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
Iran: ఇరాన్ భద్రతా బలగాలే టార్గెట్‌గా సున్నీ ఇస్లామిస్ట్ గ్రూప్ దాడులకు తెగబడింది. పాకిస్తాన్-ఇరాన్ సరిహద్దుల్లోని సిస్తాన్-బలూచిస్తాన్‌లోని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రధాన కార్యాలయంపై జైష్ అల్-అద్ల్ దాడికి తెగబడింది.
పాకిస్థాన్ లో క్లిష్ట పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒక వైపు తాలిబన్లతో యుద్ధ వాతావరణం నెలకొంది. దేశంలో నిరంతరం జరుగుతున్న ఉగ్రదాడుల కారణంగా ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది.
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ రాజధాని పెషావర్‌లో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ పేలుడులో కనీసం ఇద్దరు మరణించినట్లుగా అదికారులు వెల్లడించారు. పెషావర్‌లోని బోర్డ్ జబార్ సమీపంలో ఆత్మాహుతి దాడి జరిగింది. గాయపడిన వారిని సమీపంలోని లేడీ రీడింగ్ హాస్పిటల్‌కి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
Terrorist Attack: జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. పూంచ్‌లో శుక్రవారం సాయంత్రం ఉగ్రవాదులు ఆర్మీ వాహనంపై దాడికి తెగబడ్డారు. లోపల ఉన్న సైనికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. వెంటనే సైనికులు కూడా ఉగ్రవాదులపైకి కాల్పులు జరిపారు. ఇప్పటి వరకు ఈ ఎదురుకాల్పుల్లో గాయాలు, కానీ మరణాలు కానీ నివేదించబడలేదు. సమీపంలోని ఎత్తైన కొండ పై నుంచి ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దాడికి గురైన ఆర్మీ కాన్వాయ్‌లో అనేక వాహనాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Poonch attack: జమ్మూ కాశ్మీర్ పూంచ్‌లో గురువారం జరిగిన ఉగ్రవాద దాడిలో ఐదుగురు జవాన్లు మరణించారు. పక్కా ప్లాన్ ప్రకారం ఎత్తైన ప్రాంతం నుంచి ఆర్మీ వాహనాలపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనకు పాక్ ఆధారిత లష్కరే తోయిబా ఉగ్రసంస్థకి చెందిన పీఏఎఫ్ఎఫ్ పనిగా బాధ్యత ప్రకటించింది. అయితే ఈ దాడి వెనక దాయాది దేశం పాకిస్తాన్‌తో పాటు దాని ఆప్తమిత్ర దేశం చైనా ఉన్నట్లుగా నిఘావర్గాలు తెలుపాయి.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. ఈ రోజు ఆర్మీ ట్రక్కుపై మెరుపుదాడికి పాల్పడ్డారు. నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో సైన్యంపై జరిగిన రెండో దాడి ఇది. దాడి జరిగిన ప్రాంతానికి అదనపు బలగాలు పంపినట్లు సమాచారం. కాల్పులు జరుగుతున్నాయని తెలుస్తోంది. పూంచ్‌లోని సురన్‌కోట ప్రాంతంలోని డేరా కీ గలీ(డీకేజీ) ప్రాంతంలో ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు.
Mumbai Attack: దేశ వాణిజ్య రాజధాని ముంబైపై మరోసారి ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ఏకంగా 40 డోన్లను ఉపయోగించి ముంబైపై భారీ ఉగ్రదాడి చేయాలనుకున్న టెర్రరిస్టుల ప్లాన్‌ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) భగ్నం చేసింది. ముంబైకి ఉత్తరాన 53 కిలోమీటర్ల దూరంలో ఉన్న పద్ఘా అనే గ్రామాన్ని షెల్టర్‌గా నిందితులు ఉపయోగించుకుంటున్నారు. ఈ కుట్రకు పాల్పడిన ఐఎస్ మాడ్యుల్ కీలక నిందితులు సాకిబ్ నాచన్‌ని అరెస్ట్ చేశారు.