Donald Trump : జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కష్టసమయంలో అందరూ భారత్ కు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ ప్రకటించింది. ‘ట్రంప్ మోడీకి ఫోన్ చేసి మద్దతు ప్రకటించారు. ఉగ్రదాడిన తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి పాల్పడిన వారిని శిక్షించేందుకు భారత్ కు సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు’ అంటూ విదేశాంగ శాఖ తెలిపింది. ఇక ట్రంప్ కు మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో అండగా ఉంటున్న వారందరికీ ప్రత్యకంగా థాంక్స్ తెలిపారు. ఈ ఘటనపై అంతకు ముందు ఎక్స్ వేదికగా ట్రంప్ స్పందించారు. భారత్ కు అండగా ఉంటామన్నారు.
Read Also: Nani : చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ పై అప్ డెట్ ఇచ్చిన నాని..
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా స్పందించారు. ఈ ఉగ్రదాడిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించరాదన్నారు. దాడికి పాల్పడిన వారిని చట్టం ముందు శిక్షిస్తామన్నారు. ఇప్పటికే హోం మంత్రి అమిత్ షా శ్రీ నగర్ చేరుకున్నారు. దాడి జరిగిన పహల్గాంకు ఈ రోజు వెళ్లి పరిశీలిస్తారు. ఈ ప్రాంతమంతా రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఉన్నతాధికారులతో హోం మంత్రి చర్చలు జరుపుతున్నారు. టెర్రరిస్టులు వెళ్లిన అడవుల్లో సాయుధ బలగాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. టెర్రరిస్టులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని సైనిక బలగాలు చెబుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ తన సౌదీ పర్యటనను అర్థాంతరంగా ముగించుకున్నారు.