Gyanvapi Case: జ్ఞానవాపి వివాదంలో ముస్లిం పక్షానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆ స్థలంలో ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వారణాసి కోర్టులో పెండింగ్‌లో ఉన్న సివిల్ వ్యాజ్యాన్ని సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతేజామియా మసీదు, యుపి సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌లను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది.