వేసవిలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి. ఎండల ధాటికి ప్రజలు బెంబేలెత్తిపోయారు. మార్చి నెలలో దేశంలో ఉష్ణోగ్రత స్థాయిలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఓవైపు వేడిగాలులు, మరోవైపు చలి. దీని కారణంగా ముక్కు కారటం, గొంతు నొప్పి, దగ్గు, అతిసారం వంటి సాధారణ జలుబు లక్షణాలు ప్రబలంగా కనిపించాయి.
ప్రజలు జ్వరాల బారిన పడ్డారు. జ్వరం, ముక్కు కారటం, తలనొప్పి, గొంతు బొంగురుపోవడం లేదా మింగడంలో ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ కాలం పాటు ముక్కు కారటం,పొడి దగ్గును ఎదుర్కొంటున్నారు. వేసవి ప్రారంభమైనప్పటికీ, చాలా మందికి ఈ లక్షణాలు ఉన్నాయి. ఆకస్మిక ఉష్ణోగ్రత మార్పులు కారణంగా ముక్కు కారటం, జలుగు లాంటి లక్షణాలు ఉంటాయిన వైద్యు నిపుణులు చెబుతున్నారు.
Also Read:Governor Tamilisai: నేడు ఢిల్లీకి తెలంగాణ గవర్నర్ తమిళిసై.. పెండింగ్ బిల్లులు..?
గురుగ్రామ్‌లోని సికె బిర్లా హాస్పిటల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ తుషార్ తాయల్ మాట్లాడుతూ వైరస్‌ల మనుగడకు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. ఇన్‌ఫ్లుఎంజా బి, హెచ్1ఎన్1, హెచ్3ఎన్2, కోవిడ్ ఇతర శ్వాసకోశ సంబంధిత వైరస్‌లు వాతావరణంలో పుష్కలంగా తిరుగుతున్నాయని చెప్పారు. ఈ వైరస్లన్నీ జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, ముక్కు కారటం, కొన్ని సందర్భాల్లో వాంతులు, వదులుగా ఉండే మలం వంటి లక్షణాలను ఉత్పత్తి చేస్తాయి.
మీరు ముక్కు మూసుకుపోవడం లేదా కారుతున్నట్లయితే, ఇది సాధారణ జలుబు, ఫ్లూ, సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల సంభవించవచ్చు. కాలానుగుణ అలెర్జీలకు డీకోంజెస్టివ్, యాంటీ-అలెర్జీ మందులతో నిర్దిష్ట చికిత్స అవసరం. మాస్క్ ధరించడం, తరచుగా హ్యాండ్ శానిటైజేషన్, సామాజిక దూరం పాటించడం వంటి సాధారణ కోవిడ్ మార్గదర్శకాలతో పాటు, జ్వరం 100 డిగ్రీల ఫారెన్‌హీట్ కంటే ఎక్కువగా ఉంటే రోగి పారాసెటమాల్ టాబ్లెట్‌ను తీసుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.
Also Read:Heat Wave Predictions: ఢిల్లీలో వడగాలులు.. పాఠశాలలకు ప్రభుత్వ కీలక ఆదేశాలు
ముక్కు కారటం లేదా బ్లాక్ అయినందుకు యాంటిహిస్టామినిక్స్ తీసుకోవచ్చు. విపరీతమైన దగ్గు ఉంటే దగ్గు సిరప్ తీసుకోవచ్చు. ఉప్పునీరు పుక్కిలించడం, ఆవిరి పీల్చడం లాంటివి నొప్పి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ సి మాత్రలు కూడా కొన్ని వారాల పాటు తీసుకోవచ్చు.
లక్షణాలు ప్రారంభమైన 5 రోజుల తర్వాత కూడా కొనసాగితే, ప్రత్యేకించి చిన్నపిల్లలు, వృద్ధుల కోసం వైద్యుడిని సంప్రదించండి. రికవరీకి తగినంత నీరు తీసుకోవడంతో పాటు కాలానుగుణ పండ్లు, కూరగాయలతో కూడిన సమతుల్య ఆహారం చాలా అవసరం అని వైద్య నిపుణులు చెబుతున్నారు.