అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పై విష ప్రచారం చేసిందన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వందల కోట్లు వెచ్చించి బీజేపీ, బీఆర్‌ఎస్ ఒకటే నని దుస్ప్రచారం చేసిందన్నారు. ప్రలోభాల మధ్య కూడా ఉత్తర తెలంగాణ లో బీజేపీ ఓట్లు సాధించింది….7 సీట్లు గెలిచిందన్నారు ఈటల రాజేందర్. పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ కి ఓటు వేస్తామని ప్రజలు చెప్పారని, పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ఇంకా రాలేదు…ఇప్పుడు బీజేపీ కి 27 శాతం ఓట్లు వస్తాయని సర్వే సంస్థలు చెబుతున్నాయన్నారు. తెలంగాణలో 17 స్థానాల్లో బీజేపీ పోటీ పడ్తుంది… సత్తా చాటుతోందన్నారు. పార్టీ అధిష్టానం ఎక్కడ నుండి పోటీ చేయమంటే అక్కడి నుండి పోటీ చేస్తానని ఆయన వెల్లడించారు. మోడీనీ ఆశీర్వదించాలని తెలంగాణ ప్రజల ను కోరుతున్నానన్నారు.
బీజేపీ పై కాంగ్రెస్ ఎంత విష ప్రచారం చేసినప్పటికీ ఉత్తర తెలంగాణ ప్రజానీకం మా పార్టీకి అండగా నిలిచారన్నారు. 2024 ఏప్రిల్ లో జరిగే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తామని ప్రజలు స్వచ్ఛందంగా చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలు మా నాయకుడు అని చెప్పుకునే నేత నరేంద్ర మోడీ అని ఆయన అన్నారు. వందేళ్ల ఏళ్లుగా ఎదురుచూస్తున్న అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తికాబోతుందని, దేశంలో ఎక్కడ ఏర్పాటు ఉద్యమాలు లేవన్నారు. బలుచిస్తాన్ కూడా భారత్ లో కలవాలని కోరుకుంటుందన్నారు. అంతేకాకుండా.. ప్రపంచంలోనే ఐరెన్ మ్యాన్ అని మోడీ పేరు తెచ్చుకున్నారని, రాబోయే ఎన్నికల్లో మళ్లీ మోడీ గెలుపు ఖాయమని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఒక్క స్కాం లేకుండా పదేళ్ల పాలన సాగించిన ఘనత మోడీ ప్రభుత్వానిదన్నారు. తెలంగాణ ప్రజలు సంపూర్ణంగా బీజేపీ కి అండగా నిలవాలని, 17 సీట్లు గెలవాలని అమిత్ షా దిశానిర్దేశం చేశారన్నారు.