15 ఎంపీ స్థానాలు టార్గెట్ గా పెట్టుకున్నామని, నేను ఎంపిగా పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి. ఇవాళ ఆయన ఎన్టీవీతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ వద్దని చెబుతుంది… పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని, అసెంబ్లీ ఎన్నికలప్పుడే కాంగ్రెస్ లో చేరేందుకు సోయం బాపు రావు చర్చలు జరిపారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోపు బీజేపీ నుంచి సోయం బాపురావు తో పాటు చాలా మంది బీజేపీ నేతలు కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు చూస్తున్నారని, మంత్రి వర్గ విస్తరణ సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం.. ఆయన నిర్ణయమే ఫైనల్.. హైకమాండ్ జోక్యం చేసుకోదన్నారు మధుయాష్కి.
అంతేకాకుండా..’గ్రేటర్‌లో ముస్లింలు, సెటిలర్లు, రియల్టర్ల ఓట్లన్నీ బీఆర్‌ఎస్‌కే పడ్డయ్.. రియల్ ఎస్టేట్ పడిపోతుందని రియల్టర్లను బీఆర్‌ఎస్ బెదిరించింది.. చంద్రబాబు జైలుకెళ్లాక సెటిలర్లు చాలా మంది కాంగ్రెస్ వైపు చూశారు.. బాబు జైలు నుంచి రిలీజ్ అయ్యాక ఇష్యూ డైల్యూట్ అయ్యింది.. వాళ్ల ఓట్లు బీఆర్‌ఎస్‌కు పడ్డయ్.. కిషన్ రెడ్డి పొద్దున లేస్తే జై అసద్ భాయ్ అంటున్నరు.. సికింద్రాబాద్‌లో గెలిచేందుకు ప్రయత్నాలు. నిజామాబాద్ నుంచి లోక్‌సభకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోటీ చేసే అవకాశం? నన్ను కావాలని ఎల్బీ నగర్‌లో ఓడగొట్టారు.. సొంత పార్టీ లీడర్లే వెన్నుపోటు పొడిచారు..
బీజేపీ చీఫ్‌గా కిషన్ రెడ్డిని మార్చేందుకే.. అమిత్ షా హైదరాబాద్‌కు వస్తున్నది అందుకే.. ఓ కేంద్ర మంత్రి స్వయంగా ఈ విషయం చెప్పిండు.. హైకమాండ్ నన్ను కూడా పాదయాత్ర చేయమన్నది.. అప్పటికే రేవంత్, భట్టి పాదయాత్ర చేశరు.. నేను చేస్తే మూడో వాడిని.. ముగ్గురం మూడు దిక్కులకు పోయినట్టు ఉండేది.. దానిమీద విమర్శలు వచ్చేవి.. పాదయాత్ర చేస్తే వ్యక్తిగతంగా నాకు మేలు జరిగేదేమో.. పార్టీకి నష్టం జరిగేది కదా.. పీసీసీ బీసీలకు ఇస్తరు అనేది వట్టి ఊహాగానాలే.. పీసీసీ చీఫ్‌గా రెడ్డి మంత్రి అయిన ఓ లీడర్ కూడా అడుగుతున్నరు.. రెడ్డి లీడర్లు పీసీసీ రేసులో ఉన్నరు. నామినేటెడ్ పోస్టుల విషయంలో కర్ణాటక ప్రభుత్వం ఎమ్మెల్యేలకు మాత్రమే ప్రపోజల్ పెడితే రాహుల్ గాంధీ తిరస్కరించారు.. పార్టీ కోసం కష్టపడిన వారిని నామినేటెడ్ ఇవ్వాలని అధిష్టానం చూస్తుంది… ఎమ్మెల్సీ పై అధిష్టానం చూసుకుంటుంది.. కవిత ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా…? కవిత కి నిజామాబాద్ లో పోటీ చేసే దైర్యం ఉందా. ..?’ అని మధుయాష్కి అన్నారు.