ఒక్క బిర్యానీ తిని ఏడు లక్షల రూపాయల కారు గెలుచుకున్నాడు ఓ లక్కీ ఫెలో. తిరుపతి నగరంలోని రోబో హోటల్లో నిర్వహించిన బిర్యాని లక్కీ డ్రా లో రాహుల్ అనే వ్యక్తి నిస్సాన్ మాగ్నట్ కారు ఉచితంగా పొందాడు.
వార్ 2 vs ధూమ్ 4… బాలీవుడ్ కూడా మన హీరోల మధ్యే వార్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే నార్త్ ఇండియాలో జెండా పాతి ఖాన్స్ కి కూడా అందని రికార్డ్స్ ని క్రియేట్ చేస్తున్నాడు. షారుఖ్ లాంటి సూపర్ స్టార్ హీరోతో క్లాష్ ఉన్నా కూడా ప్రభాస్ నార్త్ బెల్ట్ లో వంద కోట్లని రాబడుతున్నాడు అంటే ప్రభాస్ మార్కెట్ హిందీలో ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు చరణ్, ఎన్టీఆర్ కూడా…
గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో పాలస్తీనా అథారిటీ మాజీ మంత్రి మరణించినట్లు గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని అల్-మఘాజీ శరణార్థి శిబిరంపై జరిగిన సమ్మెలో పాలస్తీనా అథారిటీలోని మత వ్యవహారాల మాజీ మంత్రి 68 ఏళ్ల యూసఫ్ సలామా మరణించినట్లు వఫా వార్తా సంస్థ, మంత్రిత్వ శాఖ నివేదించాయి.
నూతన సంవత్సరం 2024 లోకి (సోమవారం) నేడు అడుగుపెడుతున్న నేపథ్యంలో తెలుగు వారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది.. కొత్త ఆశలు.. కొత్త కోరికలు.. కొత్త లక్ష్యాలు.. కొత్త ఆశయాలు.. కొత్త నిర్ణయాలు.. కొత్త వేడుకలు.. కొత్త ఉత్సాహం మీతో కలకాలం ఉండాలని కోరుకున్నారు. 2024లో ఇంటింటా ఆనందాలు, ప్రతీ కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లి విరియాలని, తెలంగాణలోని అన్ని సామాజిక వర్గాలు సుస్థిరమైన అభివృద్ధి…
రాజస్థాన్ లోని కోటాలో విద్యార్థులు ఈసారి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోలేరు. నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి కోచింగ్ సెంటర్లు, విద్యార్థులకు కోటా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా కోచింగ్ ఏరియాలో లౌడ్ మ్యూజిక్ సిస్టమ్‌పై నిషేధం ఉంటుందని పోలీసులు తెలిపారు. హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్‌లు, మెస్‌ల దగ్గర మద్యం, మత్తు పదార్థాలు సేవించరాదని చెప్పారు. కోటా సిటీ ఎస్పీ శరద్ చౌదరి కూడా ఈ ఉత్తర్వును కచ్చితంగా అమలు చేయాలని కోచింగ్…
జూన్‌లో వెస్టిండీస్, అమెరికాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ జరగనుంది. అందులో టీమిండియాకు పెద్ద ముప్పుగా మారే జట్టును భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చెప్పాడు. 2024 ప్రపంచకప్ టోర్నీలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల కంటే అఫ్గానిస్థాన్ నుంచి టీమిండియాకే ఎక్కువ ముప్పు పొంచి ఉందని అన్నాడు. కాగా.. 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్ టైటిల్ గెలవడంలో గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషించాడు. టీమిండియా టైటిల్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోందని, అందుకే టీ20…
ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. భర్త, బావ కలిసి ఓ మహిళను వివస్త్రను చేసి, పరిగెత్తేలా చేసి కొట్టారు. అంతేకాకుండా.. గొంతు నులిమి హత్య చేసేందుకు కూడా ప్రయత్నించారు. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు తనపై ఒత్తిడి తెచ్చారని బాధితురాలు ఆరోపించింది. ఎస్ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. కొత్త ఆశతో, కొత్త సంకల్పంతో, కొత్త విశ్వాసంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదామని చంద్రబాబు అన్నారు.
ఎంజిఎంలో రోగులకు మెరుగైన సేవలు అందించాలన్నారు మంత్రి కొండా సురేఖ. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 21 నుండి 170 పరీక్షలు చేయగా 25 పాజిటివ్ రాగా 10 మంది ఎంజిఎం లో చేరి 2 మంది రికవరీ అయ్యారు. 7గురు చికిత్స పొందుతున్నారన్నారు. 1200 ఆక్సిజన్ బెడ్స్ , 3 ఆక్సీజన్ ట్యాంక్స్ సిద్ధంగా ఉన్నాయని, పవర్ కట్ అయినపుడు 5 జనరేటర్ల ద్వారా ఎంజిఎం లో నిరంతరాయ విద్యుత్తు సరఫరా అందించాలన్నారు. ఎంజీఎం…
తిరుమల తిరుపతి దేవస్థానంకు భక్తుల తాకిడి భారీగా పెరిగింది. కొన్ని నెలలుగా స్వామివారి మొక్కులు తీర్చుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో భారీగా నగదు, ఇతర విలువైన వస్తువులను స్వామివారికి సమర్పిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హుండీకి కాసుల వర్షం కురుస్తోంది.