టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ శుభ్‌మన్ గిల్ కు సంబంధించిన ఓ పాత పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆ పోస్ట్ లో గతేడాది (2022) డిసెంబర్ 31న తాను ఏ లక్ష్యాలు పెట్టుకున్నానో చెప్పాడు. అయితే అందులో శుభ్‌మాన్ ఆ లక్ష్యాలను చాలా వరకు సాధించాడు. గతేడాది గిల్ పెట్టుకున్న లక్ష్యాలను పరిశీలిస్తే.. వాటిలో అన్నింటినీ అధిగమించాడు.. కానీ ఒక్కటి నెరవేరలేదు. అదేంటంటే.. టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలవడం. కాగా.. గిల్ ఈ ఏడాదికి…
కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం నుండి దిగువ అయకట్టు పరిధిలోని పంటలకి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 2023 స్పూర్తికి నాంధి పలికిందన్నారు. యాసంగి పంటకి నీరు అందించడానికి మానేరు నుండి నీటిని విడుదల చేసినామన్నారు. వరి మీద అధారపడకుండా ఆరు తడి పంటలు వేయాలని రైతులకి విజ్ఞప్తి చేశారు. అరుతడి పంటలు వేసి,ప్రభుత్వం నుండి ప్రోత్సాహం…
షీనా చోహన్ తన నూతన చిత్రం "అమర్-ప్రేమ్" పూర్తి చేసి విజయవంతంగా 2023 ఏడాదికి గుడ్ బై చెప్పనున్నారు. ట్రయాంగిల్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కించిన "అమర్-ప్రేమ్" వచ్చే ఏడాది ప్రపంచ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధంగా ఉంది. జాతీయ అవార్డు, ఫిలింఫేర్ అవార్డు అందుకున్న సువేందు రాజ్ ఘోష్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శించబడుతుంది.
‘చదివిందేమో టెన్త్ రో.. అయిందేమో డాక్టర్’ అంటూ అమ్మడు పాడే పాటకి కుర్రకారు అంతా మైమరచిపోతున్నారు. ఇంతకీ టెన్త్ క్లాస్ చదివి డాక్టర్ అయిన అమ్మాయెవరో తెలుసుకోవాలంటే మాత్రం ‘రాఘవ రెడ్డి’ సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. శివ కంఠమనేని హీరోగా రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘రాఘవ రెడ్డి’. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి దర్శకత్వంలో KS శంకర్ రావ్,…
కొత్త సంవత్సరం నేపథ్యంలో ఏపీలో పెన్షన్ రూ.3వేలకు పెంచింది సర్కారు. విశ్వసనీయతకు అర్థం చెబుతూ, మానవత్వానికి ప్రతిరూపంగా, పెన్షన్లను క్రమంగా రూ.3వేలకు పెంచుకుంటూ పోతామని ఇచ్చిన హామీని సంపూర్ణంగా నెరవేర్చారు ముఖ్యమంత్రి వైయస్ జగన్. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ఇకపై ప్రతినెలా రూ. 3వేల పెన్షన్ ఇవ్వనున్నారు.
మీ పిల్లల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కోసం మీరు ఎంతో కష్టపడుతుంటారు. పిల్లల ఆరోగ్యం కోసమని పోషకమైన వంటకాలు, పండ్లను ఇస్తుంటారు. వాటితో పాటు ABCని కూడా ఇస్తే చదువులో దూసుకుపోతారు. అంతేకాకుండా.. చలికాలంలో పిల్లలకు ABC జ్యూస్ చాలా మంచింది. అసలు ABC జ్యూస్ అంటే.. ఆపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్. ఇది A నుండి Z వరకు ప్రతి రకమైన పోషకాల లోపాన్ని తీరుస్తుంది. ABC జ్యూస్ తాగడం వలన పిల్లలకు ఎన్ని ప్రయోజనాలు…
చలికాలంలో చాలా మంది దగ్గు మరియు జలుబుతో బాధపడుతుంటారు. ఛాతీలో కఫం పేరుకుపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. కొన్నిసార్లు శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. ఊపిరితిత్తులలో దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ న్యుమోనియా ప్రమాదాన్ని పెంచుతుంది. కఫం ఉంటే రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవడం సాధ్యం కాదు. ఈ సమస్యకు ఇక్కడ ఇచ్చిన ఆయుర్వేద కషాయాన్ని తాగండి. మీరు 3-4 రోజుల్లో ఉపశమనం పొందుతారు. ఔషధ తయారీకి కావలసిన పదార్థాలు 1. సుమారు 1 అంగుళం అల్లం ముక్క 2.…
వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి గౌరవం పెరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం లక్కీ జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో బొబ్బిలి నియోజకవర్గ గడపగడపకు ముగింపు కార్యక్రమ బహిరంగ సభకు మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు.
యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనపై వేధింపులకు పాల్పడుతున్నారని నిరసన తెలిపినందుకు ఓ బాలికను క్రషర్లో వేసి హత్యకు పాల్పడ్డారు నిందితులు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారు. బాగ్‌పత్‌లో.. క్రషర్ యజమానితో సహా ముగ్గురు వ్యక్తులు షెడ్యూల్డ్ కులాల అమ్మాయిపై వేధింపులకు పాల్పడుతున్నారు. ఏంటని బాలిక నిరసన వ్యక్తం చేయగా.. ఆమెను క్రషర్‌లోని వేడి నిప్పులలోకి విసిరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా.. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు…
న్యూజిలాండ్ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ దేశంలో పెద్దనగరమైన ఆక్లాండ్‌లో కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. 2024కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు కివీస్ ప్రజలు. ఈ సందర్భంగా ప్రదర్శించిన లేజర్, ఫైర్వర్క్స్ షో అబ్బురపరిచాయి.