నూతన సంవత్సరం 2024 లోకి (సోమవారం) నేడు అడుగుపెడుతున్న నేపథ్యంలో తెలుగు వారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది.. కొత్త ఆశలు.. కొత్త కోరికలు.. కొత్త లక్ష్యాలు.. కొత్త ఆశయాలు.. కొత్త నిర్ణయాలు.. కొత్త వేడుకలు.. కొత్త ఉత్సాహం మీతో కలకాలం ఉండాలని కోరుకున్నారు. 2024లో ఇంటింటా ఆనందాలు, ప్రతీ కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లి విరియాలని, తెలంగాణలోని అన్ని సామాజిక వర్గాలు సుస్థిరమైన అభివృద్ధి పథంలో ప్రయాణించేలా కాంగ్రెస్ ఇందిరమ్మ పాలన ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రజలతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క
రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి దనసరి అనసూయ సీతక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితాలలో నూతన అధ్యాయంగా ఉండాలని కోరారు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి శ్రీనివాసరెడ్డి
తెలంగాణ ప్రజలందరికీ మంత్రి శ్రీనివాసరెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన ఏడాదిలో ప్రతీ ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు
డ్యాన్స్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో మంత్రి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి స్టెప్పులు వేశారు.