వార్ 2 vs ధూమ్ 4… బాలీవుడ్ కూడా మన హీరోల మధ్యే వార్
రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే నార్త్ ఇండియాలో జెండా పాతి ఖాన్స్ కి కూడా అందని రికార్డ్స్ ని క్రియేట్ చేస్తున్నాడు. షారుఖ్ లాంటి సూపర్ స్టార్ హీరోతో క్లాష్ ఉన్నా కూడా ప్రభాస్ నార్త్ బెల్ట్ లో వంద కోట్లని రాబడుతున్నాడు అంటే ప్రభాస్ మార్కెట్ హిందీలో ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు చరణ్, ఎన్టీఆర్ కూడా నార్త్ లో సోలో సాలిడ్ మార్కెట్ కోసం రెడీ అవుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో హిందీ బెల్ట్ లో స్టార్స్ గా ఎంట్రీ ఇచ్చారు ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్. జక్కన్న ఇచ్చిన ఎంట్రీ పాస్ తో బాలీవుడ్ లో సత్తా చాటాలి, మార్కెట్ సొంతం చేసుకోవాలి అంటే మాత్రం ఎన్టీఆర్ అండ్ చరణ్ సొంతగా కష్టపడాలి, నార్త్ ఆడియన్స్ కి నచ్చే సినిమాలు చేయాలి. ఇప్పుడు ఈ పని చేయడానికే ఎన్టీఆర్-ఎన్టీఆర్ రెడీ అవుతున్నారని సమాచారం. ఎన్టీఆర్ ఇప్పటికే హ్రితిక్ రోషన్ తో వార్ 2 సినిమాలో నటిస్తున్నాడు. అనౌన్స్మెంట్ తోనే బజ్ జనరేట్ చేసిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అయిపొయింది. దేవర షూటింగ్ కంప్లీట్ అయిపోతే ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో జాయిన్ అయిపోతాడు. ఇప్పుడు చరణ్ కూడా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
రామమందిరం కూడా పుల్వామా దాడి లాంటి పొలిటికల్ స్టంట్..మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
కాంగ్రెస్ నేత, కర్ణాటక మంత్రి రామమందిరాన్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు పుల్వామా దాడి తరహాలో రామమందిర నిర్మాణం కేవలం రాజకీయ స్టంట్ మాత్రమే అని కర్ణాటక మంత్రి డీ సుధాకర్ అన్నారు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం వెనక కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాల గురించి సందేహాన్ని వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై దృష్టిని మరల్చడమే కాకుండా, ఓటర్లను ప్రభావితం చేసే వ్యూహంగా దీనిని అభివర్ణించారు.
న్యూఇయర్‌లోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్, కిరిబాటి.. ఏ దేశంలో ఎప్పుడంటే?
న్యూజిలాండ్ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ దేశంలో పెద్దనగరమైన ఆక్లాండ్‌లో కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. 2024కు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు కివీస్ ప్రజలు. ఈ సందర్భంగా ప్రదర్శించిన లేజర్, ఫైర్‌వర్క్స్ షో అబ్బురపరిచాయి. అన్ని దేశాల కంటే ముందే ఈ దేశ ప్రజలు న్యూఇయర్‌కు వెల్‌కం చెప్పారు. ప్రపంచంలో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన తొలి దేశం న్యూజిలాండ్ కావడం గమనార్హం.
డిసెంబర్ 31 అర్ధరాత్రికి గడియారం అంగుళాలు దగ్గర పడుతుండగా, కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి ప్రపంచం మొత్తం వెనుకకు లెక్కించడం ప్రారంభించింది. న్యూజిలాండ్, కిరిబాటి దేశాల్లో ఇప్పటికే నూతన సంత్సర వేడుకలు జరుగుతున్నాయి. అన్ని దేశాలు కొత్త సంవత్సరాన్ని ఒకే సమయంలో జరుపుకోవు. కొన్ని దేశాలు కొత్త సంవత్సరాన్ని దాదాపు ఒక రోజు తర్వాత కూడా స్వాగతిస్తాయి.
బాలికపై వేధింపులు.. క్రషర్లో వేసి హత్యకు పాల్పడ్డ నిందితులు
యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనపై వేధింపులకు పాల్పడుతున్నారని నిరసన తెలిపినందుకు ఓ బాలికను క్రషర్‌లో వేసి హత్యకు పాల్పడ్డారు నిందితులు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారు. బాగ్‌పత్‌లో.. క్రషర్ యజమానితో సహా ముగ్గురు వ్యక్తులు షెడ్యూల్డ్ కులాల అమ్మాయిపై వేధింపులకు పాల్పడుతున్నారు. ఏంటని బాలిక నిరసన వ్యక్తం చేయగా.. ఆమెను క్రషర్‌లోని వేడి నిప్పులలోకి విసిరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా.. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. బాలిక పరిస్థితి విషమంగా ఉందని, ఆమె ఢిల్లీలోని జిటిబి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
16వ ఆర్థిక సంఘానికి ఛైర్మన్‌గా అరవింద్ పనగఢియా..
నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగఢియా 16వ ఆర్థిక సంఘానికి చైర్మన్‌గా నియమితులయ్యారు. రిత్విక్ రంజనం పాండే కమిషన్ కార్యదర్శిగా నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో పనగఢియా ఫైనాన్స్ కమిషన్ చీఫ్‌గా నియమితులయ్యారు. ఈ ఆర్థిక సంఘం 2026 ఏప్రిల్ నుంచి ఐదేళ్ల కాలానికి సంబంధించి రూపొందించే నివేదికను అక్టోబర్ 31, 2025 నాటికి రాష్ట్రపతికి సమర్పించనుంది. ఫైనాన్స్ కమిషన్ కేంద్ర-రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలపై సూచనలు చేసే రాజ్యాంగబద్ధ సంస్థ. ఇందులో ఒక చైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు. ప్రస్తుతం 16వ ఆర్థిక సంఘానికి సంబంధించి మిగతా సభ్యులు వివారాలు వెల్లడి కావాల్సి ఉంది. 15వ ఆర్థిక సంఘానికి ప్రస్తుతం ఎన్‌కే సింగ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
రామమందిరం పేరిట భక్తుల్ని లూటీ చేస్తున్న “క్యూఆర్ కోడ్ స్కామ్”.. వీహెచ్‌పీ వార్నింగ్..
రామమందిర ప్రారంభోత్సవానికి కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. జనవరి 22, 2024న అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. దేశవ్యాప్తంగా కోట్లాది భక్తులు ఈ మహత్తర ఘట్టం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇదే అదనుగా కొందరు భక్తుల్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మహా రామాలయ సంప్రోక్షణకు కొన్ని వారాలే సమయం ఉండగా.. భక్తులను మోసం చేస్తూ, వారి నుంచి నకిలీ విరాళాలు సేకరిస్తున్న రాకెట్ వెలుగులోకి వచ్చింది. దీనిపై చర్యలు తీసుకోవాలని హిందూ సంస్థ ‘విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) కోరింది. ఈ మోసానికి గురికావద్దని ప్రజలను కోరుతూ.. సోషల్ మీడియాలో హెచ్చరికలు జారీ చేసింది.
వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి గౌరవం పెరిగింది..
వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి గౌరవం పెరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం లక్కీ జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో బొబ్బిలి నియోజకవర్గ గడపగడపకు ముగింపు కార్యక్రమ బహిరంగ సభకు మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమానికి ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు హాజరయ్యారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..” ఈ నాలుగేళ్లలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశామో ఇంటింటికి వెళ్లి వివరించాం. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే వాటిని పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ పార్టీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి… అభివృద్ధి చేసేది జగనే అని అన్నారు. అంగన్వాడీలో సమస్యలు సుమారు 90 శాతం సమస్యలను పరిష్కరించాం. ఒకటో రెండు సమస్యలు ఉన్నాయని కూడా త్వరగా పరిష్కరిస్తాం.” అని మంత్రి హామీ ఇచ్చారు.
‘రాఘవ రెడ్డి’ చిత్రం నుంచి ఐటెమ్ సాంగ్ రిలీజ్..
‘చదివిందేమో టెన్త్ రో.. అయిందేమో డాక్టర్’ అంటూ అమ్మడు పాడే పాటకి కుర్రకారు అంతా మైమరచిపోతున్నారు. ఇంతకీ టెన్త్ క్లాస్ చదివి డాక్టర్ అయిన అమ్మాయెవరో తెలుసుకోవాలంటే మాత్రం ‘రాఘవ రెడ్డి’ సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. శివ కంఠమనేని హీరోగా రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘రాఘవ రెడ్డి’. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి దర్శకత్వంలో KS శంకర్ రావ్, R.వెంకటేశ్వర్ రావు, G.రాంబాబు యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఐదేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడి అత్యాచారం..
దేశంలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. పోక్సో, నిర్భయ వంటి కఠినమైన అత్యాచార నిరోధక చట్టాలు ఉన్నప్పటికీ కామాంధులు మాత్రం అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. చాలా సందర్భాల్లో తెలిసిన వ్యక్తుల నుంచే అత్యాచారాలకు గురవుతున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లో ఐదేళ్ల బాలికపై పొరుగున ఉండే టీనేజర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. యూపీలోని ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలుడు, 5 ఏళ్ల బాలికను తన గ్రామం నుంచి సైకిల్‌పై ఇంటిలో దించే ముందు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం జరిగినట్లు సిరాతు సీఐ అవధేష్ కుమార్ విశ్వకర్మ తెలిపారు. బాలిక పరిస్థితిని చూసిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం పంపనున్నట్లు తెలిపారు.
వరి మీద అధారపడకుండా ఆరు తడి పంటలు వేయాలి
కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం నుండి దిగువ అయకట్టు పరిధిలోని పంటలకి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 2023 స్పూర్తికి నాంధి పలికిందన్నారు. యాసంగి పంటకి నీరు అందించడానికి మానేరు నుండి నీటిని విడుదల చేసినామన్నారు. వరి మీద అధారపడకుండా ఆరు తడి పంటలు వేయాలని రైతులకి విజ్ఞప్తి చేశారు. అరుతడి పంటలు వేసి,ప్రభుత్వం నుండి ప్రోత్సాహం తీసుకొనండన్నారు. రైతులకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రభుత్వం ఉంటుందని, ప్రజాపాలన లలో ఎలాంటి నిబంధనలు లేవన్నారు. అరు గ్యారంటీ అప్లికేషన్ లో మీకు తెలిసిన సమాచారాన్ని ఇవ్వండని ఆయన అన్నారు.
కొత్త ఏడాదికి పొలిటికల్ కలర్.. గోదారి గట్టున గెట్ టుగెదర్
ఉభయ గోదావరి జిల్లాల్లో కొత్త ఏడాదికి పొలిటికల్ కలర్ పులుముకుంది. ముఖ్యంగా వైసీపీ నేతలు విందులు, ఆత్మీయ సమావేశాలతో కేడర్‌లో జోష్ నింపే పనిలో పడ్డారు. ఈ సారి టికెట్ రాని అధికార పార్టీ నేతలు, టికెట్ వస్తుందని ఆశాభావంలో ఉన్న నాయకులు ఈ న్యూ ఇయర్‌ను గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వైసీపీ అధిష్ఠానం సీటును నిరాకరించింది. ఈ క్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు నియోజకవర్గ కేంద్రం భారీ విందు ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు మండలాల నుంచి కేడర్ వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించాలని ఆహ్వానిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆయన జనసేన అధినేత పవన్‌ను కలిశారు. పార్టీ మార్చే ముందు తన బలాన్ని నిరూపించుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు టాక్ నడుస్తోంది.
2023 సంవత్సరంలో శ్రీవారి హుండీ ఆదాయం ఎంతో తెలుసా?
తిరుమల తిరుపతి దేవస్థానంకు భక్తుల తాకిడి భారీగా పెరిగింది. కొన్ని నెలలుగా స్వామివారి మొక్కులు తీర్చుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో భారీగా నగదు, ఇతర విలువైన వస్తువులను స్వామివారికి సమర్పిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హుండీకి కాసుల వర్షం కురుస్తోంది. గతేడాది కాలం నుంచి స్వామివారి హుండీ ఆదాయం ప్రతీనెల 100కోట్లకుపైగానే సమకూరుతూ వస్తోంది. 2023 సంవత్సరంలో శ్రీవారికి హుండీ ద్వారా 1398 కోట్ల రూపాయల ఆదాయం టీటీడీ అధికారులు వెల్లడించారు. ప్రతి నెలా 100 కోట్ల మార్క్‌ను దాటినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో జులై నెలలో అత్యధికంగా రూ.129 కోట్ల హుండీ ఆదాయం లభించింది. నవంబర్ నెలలో అత్యల్పంగా రూ.108 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు తెలిసింది.
యూపీలో అమానుషం.. కట్నం డబ్బులు తీసుకురాలేదని మహిళను వివస్త్రను చేశారు..
ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. భర్త, బావ కలిసి ఓ మహిళను వివస్త్రను చేసి, పరిగెత్తేలా చేసి కొట్టారు. అంతేకాకుండా.. గొంతు నులిమి హత్య చేసేందుకు కూడా ప్రయత్నించారు. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు తనపై ఒత్తిడి తెచ్చారని బాధితురాలు ఆరోపించింది. ఎస్‌ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
“సమాజానికి న్యాయం చేయని వాళ్లే”.. రాహుల్ యాత్రపై జేపీ నడ్డా ఫైర్
రాహుల్ గాంధీ తలపెట్టిన ‘భారత న్యాయ యాత్ర’పై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మండిపడ్డారు. సమాజానికి న్యాయం చేయని వాళ్లు ఇప్పుడు ‘న్యాయ యాత్ర’ గురించి ఆలోచిస్తున్నారంటూ ఆదివారం విమర్శించారు. లక్నోలో జరిగిన బహిరంగ సభను ఉద్దేశిస్తూ.. ఇండియా కూటమిపై ఫైర్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. ఇండియా కూటమి దేశాన్ని కిందికి లాగేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు.