Health: నల్ల జీలకర్ర గురించి లాభాలు తెలుసా..? ఈ సమస్య ఉన్న వారు వాడండి
- నల్ల జీలకర్రతో రక్తంలో చక్కెరను నియంత్రించవచ్చు
- నల్ల జీలకర్రలో చాలా ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు
- యాంటీ ఆక్సిడెంట్ల యొక్క అద్భుతమైన మూలం
- నల్ల జీలకర్రలో భాస్వరం, ఇనుము, జింక్, కాల్షియం, ఫైబర్, పొటాషియం
- నల్ల జీలకర్ర (నిగెల్లా సీడ్స్) ఆరోగ్యానికి చాలా మేలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి బిజీ లైఫ్, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా.. కొన్ని ఆరోగ్య సమస్యలు ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఎక్కువగా బ్లడ్ షుగర్, హైబీపీ సమస్యల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో.. చక్కెరను నియంత్రించడం చాలా ముఖ్యం. ఎందుకంటే చక్కెర స్థాయి పెరిగేకొద్దీ.. అనేక వ్యాధులు శరీరంలో నష్టాన్ని కనబరుస్తున్నాయి. ఇది క్రమంగా తీవ్రమైన వ్యాధిగా మారుతుంది. అయితే.. నల్ల జీలకర్ర సహాయంతో రక్తంలో చక్కెరను సహజంగా నియంత్రించవచ్చు. నల్ల జీలకర్రను ఆయుర్వేదంలో ఒక ప్రత్యేక సహజ ఔషధంగా పిలుస్తారు. నల్ల జీలకర్ర సాధారణ జీలకర్ర నుండి కొద్దిగా భిన్నంగా ఉంటుంది.
పబ్ మెడ్ సెంట్రల్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. నల్ల జీలకర్రలో చాలా ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. ఇది యాంటీఆక్సిడెంట్ల యొక్క అద్భుతమైన మూలం. అంతేకాకుండా.. భాస్వరం, ఇనుము, జింక్, కాల్షియం, ఫైబర్, పొటాషియం కూడా ఉంటాయి. నల్ల జీలకర్ర (నిగెల్లా సీడ్స్) ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. నల్ల జీలకర్రను మందులు, ఆహారం, ఔషధాలలో ఉపయోగిస్తారు. నల్ల జీలకర్ర జీర్ణవ్యవస్థకు అద్భుతంగా పని చేస్తుంది.. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
Also Read
- Homemade Rava: బయట కొనే రవ్వలో మైదా కల్తీ, పురుగుల భయమా? ఇంట్లోనే స్వచ్ఛమైన రవ్వ చేసుకోండిలా!
- Palak Paneer Pakoda Recipe: ఇంట్లోనే సింపుల్గా పాలక్ పనీర్ పకోడాలు.. తయారీ విధానం ఇదిగో!
- Protein Rich Foods: ఒంట్లో బలం అమాంతం పెంచే హై ప్రోటీన్ రొట్టె.. చాలా సింపుల్ ఇలా చేసుకోండి!
- Homemade Recipes: రొటీన్ పచ్చళ్లు బోర్ కొట్టాయా? ఈ పచ్చడి ట్రై చేయండి.. ఒక్క ముద్ద తిన్నా వదిలిపెట్టరు!
Read Also: Gurugram: బాలిక ప్రైవేట్ ఫొటోలతో బ్లాక్మెయిల్.. రూ.80 లక్షలు అపహరణ
నల్ల జీలకర్ర యొక్క ప్రయోజనాలు:
జీర్ణవ్యవస్థ బలంగా ఉంటుంది
నల్ల జీలకర్ర జీర్ణక్రియకు మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను దూరం చేయడంలో మేలు చేస్తుంది. నల్ల జీలకర్రలో యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. ఇది గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి వంటి అనేక కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం అందించడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణ ఎంజైమ్లను సక్రియం చేస్తుంది. అంతేకాకుండా.. ఆకలిని పెంచడంలో సహాయపడుతుంది.
చక్కెర నియంత్రణ
రక్తంలో చక్కెరను నియంత్రించడంలో నల్ల జీలకర్ర తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్, ఇతర పోషకాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచకుండా నిరోధిస్తాయి. నల్ల జీలకర్ర మధుమేహంలో చాలా ప్రభావవంతమైన ఔషధం. రోజూ జీలకర్ర తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
బరువు తగ్గిస్తుంది
నల్ల జీలకర్ర తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. నల్ల జీలకర్రలో ఉండే ఫైబర్.. ఇతర పోషకాలు ఆకలిని నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది అతిగా తినడాన్ని నిరోధిస్తుంది.. దీంతో బరువును అదుపులో ఉంచుతుంది.
రోగనిరోధక శక్తి బూస్ట్
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నల్ల జీలకర్రను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు మరియు ఫ్లూ నిరోధిస్తుంది.
నల్ల జీలకర్ర ఎలా ఉపయోగించాలి
ఒక చెంచా నల్ల జీలకర్రను నీటితో ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోండి.
1 టీస్పూన్ నల్ల జీలకర్ర పొడిని 1 టీస్పూన్ తేనెతో కలిపి తినండి.
నల్ల జీలకర్రను కూరగాయలు, పప్పు లేదా సలాడ్తో కలిపి తినవచ్చు.
తాజావార్తలు
-
Huawei Mate X8: 8.15 ఇంచుల డిస్ప్లే, 16GB RAMతో కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Huawei Mate X8 వచ్చేస్తోంది
-
Varanasi Target: ‘వారణాసి’ ముందు బిగ్ టార్గెట్.. మహేష్-రాజమౌళి ఈజీగా కొట్టేస్తారా?
-
IND vs PAK U19: ‘ఓ మై గాడ్.. వాట్ ఏ మ్యాచ్’.. టీమిండియా త్రిల్లింగ్ విక్టరీపై వైభవ్ పోస్ట్ వైరల్!
-
India Top ODI Captains: ధోనీ టాప్.. కోహ్లీ లాస్ట్..! టాప్ కెప్టెన్స్ వీరే అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
-
UP Assembly Elections 2027: యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 100 సీట్లు కూడా రావు.. ఎస్పీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?
-
Toyota Innova Hycross Facelift: E100 ఇథనాల్ టెక్నాలజీతో నవంబర్ 25న కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?