1997లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే పుస్తకం దాదాపు 4 కోట్ల కాపీలు అమ్ముడు పోయాయి. అయితే ఈ పుస్తకం రచయిత రాబర్డ్‌టి కియోసాకి ప్రస్తుతం తీవ్ర అప్పుల్లో ఉన్నారంటూ ఇన్‌స్టా వేదికగా ఓ రీల్ పోస్ట్ చేశారు. అందులో ఆస్తులు, రుణాల మధ్య వ్యత్యాసం గురించి మాట్లాడుతూ.. ‘మన చుట్టూ ఉన్నవాళ్లు చాలా మంది విలాసాల కోసం అప్పు చేస్తారు.. కానీ నేను మాత్రం ఆస్తులను కొనడానికి అప్పు చేశాను.. ఫెరారీ, రోల్స్ రాయల్స్ లాంటి విలాసవంతమైన వాహనాలు అప్పు.. అవి ఆస్తులు కావు అంటూ అతడు చెప్పుకొచ్చాడు.
Read Also: Chiru: ఇంద్రసేనా రెడ్డి మళ్లీ వస్తున్నాడు…
సంపాదనను డబ్బు రూపంలో ఆదా చేయను అని రాబర్డ్‌టి కియోసాకి పేర్కొన్నారు. పెట్టుబడుల్లో భాగంగా నేను చేసిన అప్పు 1.2 బిలియన్ డాలర్ల (రూ.10 వేల కోట్లు)కు చేరిందన్నారు. పెట్టుబడుల రూపంలో తాను చేసిన అప్పే తన ఆస్తి అని కియోసాకి పేర్కొన్నారు. తన పుస్తకంలో పెట్టుబడులకు సంబంధించిన విషయాలను వివరంగా చెప్పుకొచ్చారు.. అత్యవసర వస్తువులు, అవసరమైన వస్తువులు, అనవసరమైన వస్తువులు అంటూ విభజించుకుని డబ్బు వెచ్చించాలని పేర్కొన్నారు.. డబ్బును మరింత పెంచేలా పెట్టుబడి పెట్టేందుకు చేసే రుణాలు గుడ్ డెట్ అన్నారు. డబ్బు ఖాళీగా బ్యాంక్ ఖాతాల్లో ఉండడంకంటే మంచి రాబడులు వచ్చే మార్గాల్లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. స్టాక్‌మార్కెట్‌లో డివిడెంట్ ఇచ్చే స్టాక్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తే.. మార్కెట్ ఒడుదొడుకులను లోనైతే బంగారం, రియల్ ఎస్టేట్‌లో మదుపు చేయాలని రాబర్డ్‌టి కియోసాకి తన పుస్తకంలో రాసుకొచ్చారు.