టాలీవుడ్‌లో ఇప్పుడు ఒకటే చర్చ.. అనేక అంచనాలు ఏర్పరుచుకున్న ‘పెద్ది’, ‘ది పారడైజ్’ సినిమాల పరిస్థితి ఏంటి? అని, నిజానికి ఈ రెండు భారీ ప్రాజెక్టుల విషయంలో మేకర్స్ పాటిస్తున్న మౌనం ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో పలు అనుమానాలకు దారితీస్తోంది. సాధారణంగా ఏదైనా పెద్ద సినిమా విడుదల దగ్గరపడుతోందంటే, కనీసం రెండు మూడు నెలల ముందు నుంచే ప్రచార పర్వం హోరెత్తిపోతుంది. టీజర్లు, సాంగ్స్, గ్లింప్స్ అంటూ సోషల్ మీడియాను నిద్ర పోనివ్వరు, కానీ ప్రస్తుతం ‘పెద్ది’, ‘ది పారడైజ్’ చిత్రాల విషయంలో సీన్ రివర్స్‌లో కనిపిస్తోంది.
Also Read: Yellamma : రాక్ స్టార్ DSP ‘ఎల్లమ్మ’ జాతర.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న రా అండ్ రస్టిక్ గ్లింప్స్!
సినిమా రిలీజ్ కావడానికి కేవలం రెండు నెలల సమయం మాత్రమే ఉంది, ఈ మధ్యలో కొత్త ఏడాది, తాజాగా సంక్రాంతి పండుగ కూడా గడిచిపోయింది. నిజానికి ఏ సినిమాకైనా ప్రమోషన్స్ మొదలుపెట్టడానికి ఇవి రెండు అతిపెద్ద సందర్భాలు కానీ, ఈ రెండు సినిమాల నిర్మాతలు మాత్రం కేవలం డేట్స్‌తో కూడిన బేసిక్ పోస్టర్లను వదిలి చేతులు దులుపేసుకున్నారు. ఎక్కడా ఊరించే వీడియో కంటెంట్ కానీ, హైప్ క్రియేట్ చేసే అప్‌డేట్ కానీ కనిపించలేదు, షూటింగ్ పెండింగ్ ఉన్నా లేదా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం జరిగినా మేకర్స్ ఇలాగే మౌనంగా ఉంటారు, ‘పెద్ది’, ‘ది పారడైజ్’ రెండూ భారీ చిత్రాలే కావడంతో, నాణ్యత విషయంలో రాజీ పడకూడదని భావిస్తున్నారా? లేక సంక్రాంతి రేసులో ఉన్న ఇతర సినిమాల హడావిడి తగ్గాక తమ ప్రమోషన్స్ ప్రతాపం చూపిద్దామని ఆగుతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Also Read:
అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ రెండు సినిమాలు అనుకున్న తేదీకి రావడం కష్టమేనన్న గుసగుసలు వినిపిస్తున్నాయి, మేజర్ వీడియో అప్‌డేట్స్ లేకపోవడం, ప్రమోషన్ షెడ్యూల్స్ ఖరారు కాకపోవడం ఇవన్నీ పోస్ట్‌పోన్మెంట్ సంకేతాలనే ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే, ఈ రెండు సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిరాశ కలిగించే విషయమే, మరి ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ మేకర్స్ ఏదైనా సాలిడ్ వీడియో అప్‌డేట్‌తో వస్తారో, లేక అధికారికంగా వాయిదా ప్రకటన చేస్తారో వేచి చూడాలి.