సైబరాబాద్ పరిధిలో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షల అమలు చేస్తున్నామన్నారు ట్రాఫిక్ డీసీపీ మాదాపూర్ డీవీ శ్రీనివాస్. ఇవాళ ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. ట్రాఫిక్ రద్దీ దృశ్య నిబంధనలు కటినతరం చేసామని, సైబరాబాద్ లిమిట్స్ లో ట్రాఫిక్ వాయిలేశన్ 11వేల కేసులు నమోదు చేసామన్నారు. రాంగ్ రూట్ లో వాహనం నడిపి ఆక్సిడెంట్ చేస్తే 304 పార్ట్2 ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. హేవి వాహనాలు డిసిఎం, వాటర్ ట్యాంకర్స్, ఆర్ ఎంసీ, జేసీబీ, ట్రాక్టర్ వాహనాలు ఉదయం 7:30 నుండి 11:30, ఈవెనింగ్ 4 నుండి 10:30 వరకు రోడ్లపై అనుమతి లేదన్నారు.
కన్స్ట్రక్షన్ ఎండ్ దేమోలిషన్ వాహనాలకు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10:30 వరకు అనుమతి లేదని ఆయన వెల్లడించారు. నిషేధిత సమయాల్లో భారీ వాహనాలు రోడ్లపై తిరిగితే మోటార్ vechile యాక్ట్ లో సెక్షన్ ల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మాల్స్, థియేటర్స్, వ్యాపార భవనాల వద్ద రోడ్ పై పార్క్ చేస్తున్న వాహనాలకు నోటీసులు ఇస్తునామని ఆయన పేర్కొన్నారు. సైబరాబాద్ పరిధిలో 55 పేలికన్ సిగ్నల్స్ ఉన్నాయని, సైబరాబాద్ లిమిట్స్ లో 34 బ్లాక్ స్పాట్ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫెమ్ వేసుకోవాలన్నారు. ఫుత్ పాత్ అక్రమిస్తున్న వ్యాపారుల మీద చర్యలు తీసుకుంటున్నామని, పిలికాన్ సిగ్నల్స్ వద్ద వాలంటీర్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సైబరాబాద్ లో డ్రంకన్ డ్రైవ్ కొనసాగుతున్నాయన్నారు.