కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ భర్త, మాజీ పీపుల్స్ వార్ నేత గాలన్న గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు కరీంనగర్లో లైఫ్ లైన్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.
రెండు మూడు రోజుల్లో సీతారామ ప్రాజెక్టుల సందర్శనకు మంత్రులందరం వెళతామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… తాము ఏదో చేస్తున్నామని భ్రమలు కల్పించారు బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు అని ఆయన మండిపడ్డారు. 1500 కోట్లతో పూర్తి అయ్యే ప్రాజెక్టులు 2981 కోట్లకు అంచనా వ్యయం పెంచారన్నారు. ఇరిగేషన్ మంత్రిగా నేనే నిర్ఘాంత పోయా.. ఇరిగేషన్ శాఖను ద్వంసం చేశారని, 94 వేల కోట్లు ఖర్చు చేస్తే కాళేశ్వరంలో లక్ష ఎకరాలకు నీరు ఇవ్వలేదన్నారు.…
నాలుగేళ్ల కిందట సుప్రీంకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య రామ జన్మభూమి కేసుపై చారిత్రాత్మక అంతిమ తీర్పునిచ్చింది. ఇప్పుడా ఐదుగురు న్యాయమూర్తులకు ప్రాణ ప్రతిష్ట ఆహ్వానం అందింది. ఈ న్యాయమూర్తులందరినీ రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రాష్ట్ర అతిథులుగా ఆహ్వానించారు. అంతే కాకుండా.. మాజీ ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు, ఉన్నత న్యాయవాదులతో సహా 50 మందికి పైగా న్యాయనిపుణులకు ఆహ్వానాలు పంపారు. ఆహ్వానితుల జాబితాలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, మాజీ అటార్నీ జనరల్…
ఖమ్మం జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. వాస్తవ పరిస్థితులను ప్రజలకు చెప్పాలని సమీక్ష సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
కర్నూలు జిల్లా పత్తికొండ టీడీపీ కార్యాలయంలో మంత్రాలయం నియోజకవర్గ ఇంఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ నెల 25న పత్తికొండలో రా..కదిలి రా కార్యక్రమం జరుగనుందని, ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలు విజయవంతం చేయాలని తిక్కారెడ్డి కోరారు.
భారత పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి.. సెర్బియా పర్యటనకు రావాల్సిందిగా ఆహ్వానం అందింది. ఈఏడాది ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు బెల్గ్రేడ్లో జరిగే.. 45వ ఇంటర్నేషనల్ టూరిజం ఫెయిర్ (ITF)కు హాజరుకావాలని.. సెర్బియా పర్యాటక శాఖ మంత్రి శ్రీ హుసేన్ మెమిక్ ఆహ్వాన పత్రాన్ని పంపించారు. యూరప్, సెర్బియా ప్రాంతంలో పర్యాటక రంగాభివృద్ధికి జరిగే అతిపెద్ద ఈవెంట్కా ఇది. గత 30 ఏళ్లుగా ఈ కార్యక్రమం జరుగుతోండగా.. ఈసారి ‘అడ్వెంచర్ బిగిన్స్ హియర్’ అనే…
మూసీ నది పునరుజ్జీవన ప్రణాళికలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ అధికారులతో సమావేశం నిర్వహించారు, మూసీ ప్రాజెక్టుకు అపెక్స్ బాడీ మద్దతు మరియు భాగస్వామ్యానికి హామీ ఇచ్చింది. థేమ్స్ నది అపెక్స్ గవర్నింగ్ బాడీ అధికారులతో ముఖ్యమంత్రి బహు కోణాల అంశాలు మరియు విభిన్న వాటాదారుల ప్రభావ అధ్యయనాలపై చర్చించారు. మూసీ నది కానీ హుస్సేన్‌సాగర్ సరస్సు చుట్టూ కేంద్రీకృతమై ఉండటం మరియు ఉస్మాన్‌సాగర్ వంటి ఇతర ప్రధాన నీటి వనరుల…
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర అసోం చేరుకుంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో పడవ ప్రయాణం చేసి శ్రీశ్రీ ఔనియతి సత్రానికి చేరుకున్నారు. అందులోని కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అతనితో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, రాష్ట్ర అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా పలువురు అగ్ర నాయకులు ఉన్నారు. 'X' లో రాహుల్ గాంధీ పోస్ట్ చేస్తూ "ఈ రోజు నేను…
సామాజిక చైతన్యాలవాడగా విజయవాడ కనిపిస్తోందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన సామాజిక సమతా భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. అంబేడ్కర్ విగ్రహం స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్.. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా గుర్తొస్తుందని సీఎం వెల్లడించారు.
నోయిడాలో పట్టపగలే దారుణ ఘటన చోటు చేసుకుంది. కారులో వెళ్తున్న వ్యక్తిని బైక్‌పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు గన్ తో కాల్చారు. జిమ్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు సూరజ్ భాన్ గా గుర్తించారు. నిందితులు ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు.