మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా కొనసాగుతుందని రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోషం వ్యక్తం చేశారు.. ఆర్టీసీ అద్దె బస్సు యజమానులు ఎదుర్కుంటున్న సమస్యల పై మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో అద్దె బస్సుల యజమానులతో సమావేశాన్ని నిర్వహించారు.. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అద్దె బస్సుల యజమానులు స్వాగతించారు.. కాని తమ బస్సుల పై పడుతున్న భారాన్ని మంత్రి దృష్టికి…
నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నన్ను తప్పించి మరొకరిని అభ్యర్థిగా ప్రకటించడం అధిష్టానం ఇష్టమన్న ఎమ్మెల్యే ఆర్థర్.. గతంలో కూడా వేరే వాళ్ళను తప్పించి తనకు టికెట్ ఇచ్చారని వెల్లడించారు.
మనీలాండరింగ్ కేసులో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్, ఆయన కుమారుడు డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌లకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెలాఖరులోగా పాట్నా కార్యాలయంలో హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరింది. భూములు తీసుకుని.. బదులుగా రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చారన్న ఆరోపణలతో నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈ ఇద్దరు నేతలను విచారించనున్నారు.
గణతంత్ర దినోత్సవ పరేడ్, బీటింగ్ రిట్రీట్ వేడుకలు, రాష్ట్రపతి భవన్లో 'ఎట్ హోమ్' కార్యక్రమాల దృష్ట్యా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను త్వరగా మూసివేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని వెల్లడించింది. జనవరి 23న నిర్వహించబోయే రిహార్సల్ కోసం సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్, వాయు భవన్, ఉద్యోగ్ భవన్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు జనవరి 22 సాయంత్రం 6.30 గంటల నుండి 23వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు మూసివేయాలని…
ముఖ్యమంత్రి దావోస్ పర్యటన విజయవంతమైంది. రూ.40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలతో తెలంగాణ కొత్త రికార్డు నెలకొల్పింది. గత ఏడాది దావోస్‌లో తెలంగాణ రాష్ట్రం సాధించిన పెట్టుబడుల మొత్తం కంటే ఇది రెండింతలు. అదానీ గ్రూప్, JSW, వెబ్ వర్క్స్, టాటా టెక్నాలజీస్, BL ఆగ్రో, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్, గోడి ఎనర్జీ, అరజెన్ లైఫ్ సైన్సెస్, ఇన్నోవెరా ఫార్మాస్యూటికల్స్, క్యూ సెంట్రియో, సిస్ట్రా, ఉబర్, ఓ9 సొల్యూషన్స్ తదితర కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధతను…
లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి భారతీయ మూలాలున్న బ్రిటిష్ పార్లమెంట్ మెంబర్లను కలుసుకున్నారు. చారిత్రాత్మకమైన వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ లో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘భారత్ మరియు బ్రిటన్ మధ్య బలమైన బంధాలలో ఒకటైన ప్రజాస్వామ్యం. ఇప్పుడు ప్రపంచం ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచడమే అత్యవసరం…’అన్నారు. వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ ను యునెస్కో 1016 సంవత్సరంలోనే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ చారిత్రక…
పవిత్రమైన వైద్య వృత్తిలో కొనసాగుతూ యువకులను మాయ మాటలతో లోబర్చుకుని హోమో సెక్స్ కు పాల్పడుతున్న వైద్యుడు డాక్టర్ జవ్వాద్ అలి ఖాజాపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని వైద్యుని భార్య అంజుమ్ బేగం విజ్ఞప్తి చేశారు. మౌలాలికి చెందిన డాక్టర్ జవ్వాద్ అలి ఖాజాతో తనకు 2014లో వివాహం జరిగిందని, తమకు ఇద్దరూ పిల్లలు ఉన్నారని ఆమె తెలిపారు. వివాహ సమయంలో తమ తల్లిదండ్రులు జవ్వాద్ కు కట్నకానుకల కింద 25 లక్షల…
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డిఎఫ్) నిరసన చేపట్టనుంది. ఫిబ్రవరి 8న న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపనున్నట్లు పేర్కొంది. కేరళ, ఇతర బీజేపీయేతర పాలిత రాష్ట్రాలను కేంద్రం ఆర్థికంగా నిర్లక్ష్యం చేసిందని ఆందోళన చేయడం ఈ నిరసన లక్ష్యమన్నారు. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ తెలిపారు. ఇది.. కేవలం కేరళ సమస్యలకు సంబంధించినది కాదని, ఇతర బీజేపీయేతర రాష్ట్రాలు పంచుకుంటున్న…
సీనియర్ ఐపీఎస్ అధికారి దల్జీత్ సింగ్ చౌదరి శుక్రవారం సశాస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బి) డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. అందుకు సంబంధించి.. సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల్లో ఈ సమాచారం అందించింది. ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి అయిన చౌదరి.. ప్రస్తుతం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ప్రత్యేక డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు.