తెలంగాణ గవర్నర్ తమిళిసై సోషల్ మీడియా ఎక్స్ ఖాతా హ్యాక్ పై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ నెల 14న గవర్నర్ ట్విట్టర్ (ఎక్స్) ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. రాజ్‌భవన్ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదుచేశారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాలను వదిలేశారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి పేరుతో దోచుకోవాలని ప్రయత్నించారని ఆయన విమర్శించారు.
బీజేపీ ఉన్నదా ? లేదా ? అన్నది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చూపెడతామని అన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబంలో KCR, KTR, కవిత, హరీష్, సంతోష్ ఈ ఐదుగురు పోటీ చేయాలని సవాల్ చేశారు. కాగా.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు బీజేపీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. బీఆర్ఎస్ గత పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్లను అమ్ముకున్నారని…
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకోవడంపై సానియా మీర్జా తండ్రి స్పందించారు. మాలిక్- సానియా మీర్జా విడాకులు తీసుకున్నారని అని తెలిపారు. 'షరియా చట్టంలో ఉన్న ఖులా పద్ధతి ప్రకారం ముస్లిం మహిళ భర్తకు విడాకులు ఇచ్చే స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. తన కూతురు సానియా కూడా ఖులా ప్రకారం షోయబ్ కు విడాకులు ఇచ్చిందని పేర్కొన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. గతేడాది జరిగిన మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అక్రమాలపై సీఈసీకి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తన మనసులో మాటను బయటపెట్టారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలయ్యాడు. ఇదిలా ఉంటే.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. గత ఎన్నికల సందర్భంగా బీజేపీ ఇచ్చిన హమీలను ప్రజలు నమ్మలేదని సంపత్ పేర్కొన్నారు. దళితులని మోసం చేసేందుకు ఎస్సీ వర్గీకరణ మీద బీజేపి కమిటీ వేసిందని దుయ్యబట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే…
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కళాకారుల గుర్తింపు కార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇతర నేతలు, కళాకారులు పాల్గొన్నారు. కళాకారులకు గుర్తింపు కార్డులను మంత్రి రోజా అందజేశారు.
కాంగ్రెస్ మంత్రులపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేఆర్ఎంబీలో తెలంగాణ చేరిందని కేంద్రం సమావేశ మినిట్స్ లో స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. ఇప్పుడు చేరలేదని రాష్ట్ర మంత్రులు బుకాయిస్తున్నారని ఆరోపించారు. మంత్రుల నోటి మాట ప్రామాణికమా? మినిట్స్ ప్రామాణికమా? అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ మంత్రులు చిన్న పిల్లల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు.
అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠకు సన్నాహాలు తుది దశలో ఉన్నాయి. ఈలోగా, రాంలాలా ముఖం యొక్క మొదటి చిత్రం శుక్రవారం వెలువడింది. ఈ రాంలాలా విగ్రహం 5 సంవత్సరాల నాటిది, దీనిని కర్నాటక ప్రత్యేక రాయితో తయారు చేశారు. రాంలాలా విగ్రహాన్ని కర్ణాటక శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు. విగ్రహం పిల్లల రూపంలో ఉంటుంది మరియు సుమారు 1800 కిలోగ్రాముల బరువు ఉంటుంది. రాంలాలా ముఖం యొక్క మొదటి చిత్రం బయటకు వచ్చిన తర్వాత, దేశవ్యాప్తంగా…