యాగగిరిగుట్ట మండలం మల్లాపురంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు రెవెన్యూ అధికారులు పోలీసుల సహకారంతో కూల్చివేశారు. 100 మంది పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు అర్ధరాత్రి దాటిన తర్వాత బీఆర్‌ఎస్ కార్యాలయానికి చేరుకుని బుల్‌డోజర్‌తో కూల్చివేశారు.
ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ బీఆర్‌ఎస్ యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య మాట్లాడుతూ రెండేళ్ల క్రితం మల్లాపురంలో 150 గజాల్లో పార్టీ మండల కార్యాలయాన్ని నిర్మించారన్నారు. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే దేవాదాయ శాఖ అధికారులు బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని కూల్చివేశారని విమర్శించారు.
జిల్లాకు చెందిన అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అధికార కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ కార్యాలయం కూల్చివేతలో అలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య (కాంగ్రెస్) పాత్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ దాడులకు దిగిందని, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పేరిట రెండేండ్ల క్రితం 150 గజాలలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టారు. కాగా, అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య దురాగాతాలకు ఒడిగడుతున్నాడని, బీఆర్‌ఎస్‌పై దాడులకు పాల్పడుతూ గ్రామాల్లో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. జాయింట్ కలెక్టర్ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండి పడుతున్నారు.