FITUR పేరుతో ప్రఖ్యాతిగాంచిన స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో జరిగే అంతర్జాతీయ టూరిజం ట్రేడ్ ఫెయిర్‌లో పాల్గొనేందుకు తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ బృందం మాడ్రిడ్ చేరుకుంది. ఈ అంతర్జాతీయ పర్యాటక, వాణిజ్య ప్రదర్శన జనవరి 24 నుంచి జనవరి 28 వరకు మాడ్రిడ్ లోని IFEMAలో జరగనుంది. అంతర్జాతీయ పర్యాటక నిపుణుల వేదిక మాత్రమే కాదు ఈ FITUR ప్రఖ్యాత వాణిజ్య ప్రదర్శన కూడా.…
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం రాంలాలా పవిత్రోత్సవానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తాజాగా.. ప్రధాని మోదీ ఆ లేఖకు కృతజ్ఞతలు తెలిపారు. అయోధ్యను నా గుండెల్లో పెట్టుకొని ఢిల్లీకి తిరిగి వచ్చాను.. తన జీవితంలో మరచిపోలేని క్షణాలను చూసి అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత మీకు ఈ లేఖ రాస్తున్నానని ప్రధాని మోడీ తెలిపారు. మీరు రాసిన లేఖ అందే సమయానికి నా మనసు భావోద్వేగంతో నిండిఉంది.. దాని నుంచి బయటపడేందుకు…
బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగిన మరుసటి రోజే అయోధ్యకు భారీగా భక్తులు పోటెత్తారు. అయితే మంగళవారం నుంచి సామాన్య భక్తులకు అనుమతిస్తుండటంతో లక్షలాది భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో అయోధ్య మొత్తం కిక్కిరిసిపోయింది. కాగా.. ఈరోజు రెండున్నర నుండి మూడు లక్షల మంది భక్తులు రాముడిని దర్శించుకున్నట్లు ఆలయ ట్రస్ట్ అంచనా వేస్తోంది. అంతేకాకుండా.. రాముడిని దర్శించుకునే భక్తులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కర్పూరీ ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. రాష్ట్రపతి విడుదల చేసిన ప్రకటనలో ఆయనకు భారతరత్న ఇవ్వనున్నట్లు ప్రకటనలో తెలిపింది. ఆయన శతజయంతి సందర్భంగా మరణానంతరం అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించారు. కాగా.. ఆయనకు భారతరత్న ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న అవార్డు ఇవ్వడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఓ పోస్ట్ ద్వారా సంతోషం వ్యక్తం చేశారు. బీహార్‌లో ప్రజా నాయకుడిగా ఎదిగిన కర్పూరీ ఠాకూర్ 1924లో…
లోక్ సభ ఎన్నికలకు యావత్ భారతదేశం సిద్ధమవుతోంది. మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కాగా.. ఏప్రిల్ 16 నుంచి లోక్ సభ ఎన్నికలు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఊహాగానాల పర్వం మొదలైంది. వివిధ సంబంధిత అధికారులను ఉద్దేశించి, 2024 లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 16 నుండి ప్రారంభమవుతాయని లేఖలో తెలిపారు. ఈ వైరల్ నోటిఫికేషన్లో.. ఈ తేదీని దృష్టిలో ఉంచుకుని ఇతర విషయాలను ప్లాన్ చేయాలని…
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డి.అనసూయ సీతక్క అన్నారు. ఉట్నూర్ కొమురంభీం కాంప్లెక్స్ సమావేశ మందిరంలో ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా ప్రగతిపై ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు రాహుల్ రాజ్ పి.ఎస్. బదావత్ సంతోష్, హేమంత్ బొర్కడే, ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్, ఇంచార్జి ఐటిడిఎ పిఓ ఖుష్బూ గుప్త, అదనపు కలెక్టర్లు…
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని సెలవు ప్రకటించకపోవడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రామమందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఒక పూట సెలవు ప్రకటించడాన్ని ప్రస్తావించిన దీదీ.. "రాజకీయ ప్రచారం" కోసం సెలవులు మంజూరు చేశారని విమర్శించారు.
జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో బీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల కోరుట్ల ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్ లు, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలను అమలు చేస్తారని ప్రజలు వెయ్యి కండ్ల…
మధ్యప్రదేశ్ లోని ఉమారియా జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. తన కారును ఓవర్టేక్ చేసినందుకు ఇద్దరు వ్యక్తులను దారుణంగా చితకబాదాడు బాంధవ్గడ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్(SDM). దీంతో అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేశారు.
ఛత్తీస్ గడ్, ఒడిస్సా రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున గంజాయి సరఫరా అవుతుంది. అది వ్యాపారంగా చాలా మంది చేస్తున్నారు. అదే దారి లో అదే వ్యాపారాన్ని కొంత మంది పోలీసులు కూడ కొనసాగిస్తున్నారు. తాజాగా ఓ పోలీసు స్టేషన్ లో పట్టుకున్న గంజాయి మాయం అయ్యింది. అదే పోలీసు స్టేషన్ లో వాహనాలు మిస్ అయ్యాయంట.. అంతే కాదు మరో చోట మాత్రం ఓ కానిస్టేబుల్ ఏకంగా గంజాయిని ఓ బ్యాచ్ తో తరలిస్తుండగా పోలీసులు…