Harish Rao : రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెదక్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తెలంగాణ తేకపోతే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడా..? అని హరీష్ రావు ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసేటట్టు కనిపిస్తుందని, కాంగ్రెస్ వచ్చింది..మార్పు మొదలైంది..ట్రాన్స్ ఫార్మర్లు, మోటార్లు కాలిపోతున్నాయన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ వచ్చాక మోటర్ రిపేర్ దుకాణాలు కొత్తవి వెలుస్తున్నాయని, కర్ణాటకలో కాంగ్రెస్ పని అయిపోయింది.. ఎంపీ ఎన్నికల్లో అక్కడ బిజెపి ఎక్కువ సీట్లు గెలుస్తుందన్నారు హరీష్ రావు. రైతు బంధు పడలేదు అంటే చేప్పుతో కొడుతా అని ఓ మంత్రి, ఇంకో మహిళ మంత్రి అగుతాలేద అంటున్నారని, మాట్లాడితే కేసులు పెడుతున్నారు..పల్లా రాజేశ్వర్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు.
Also Read
- Konda Surekha: కొండా సురేఖకు మంత్రి పదవి నుంచి ఉద్వాసన.. కీలక పదవుల్లో కొత్త నియామకాలు.!
- ED Raids: దక్షిణాదిలో 30 చోట్ల ఏకకాలంలో తనిఖీలు.. గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడీ సోదాలు.!
- Whatsapp Update: ఇకపై వాట్సాప్ నుంచే కరెంట్, వాటర్ బిల్లులు.. 22 వేలకుపైగా బిల్లర్లతో సరికొత్త సేవలు.!
- Konda Surekha: నేనేం తప్పు చేశాను.. కాంగ్రెస్ అధిష్టానంతో యుద్ధానికి సిద్ధమవుతున్న మంత్రి సురేఖ!
కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి అడిగితే దాడికి దిగుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద రోజుల్లో హామీలు నెరవేర్చకపోతే ప్రజలు కర్రు కాల్చి వాతపెడతారు. రూ. 2 లక్షల రుణమాఫీ చేయకుండా పార్లమెంటు ఎన్నికలకు వెళ్తే ప్రజలు ఓటు వేయరు. పార్లమెంటు ఎన్నికల కోడ్ రాకముందే కాంగ్రెస్ హామీలను నిలబెట్టుకుని చిత్తశుద్ధి నిరూపించుకోవాలి అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రైతుబంధు రూ. 15 వేలకు పెంచలేదన్నారు. పదివేలు కూడా సరిగ్గా రావడం లేదని చెప్పారు. రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేయలేదని దుయ్యబట్టారు. పింఛన్ రూ. 4 వేలు పెరగలేదని చెప్పుకొచ్చారు. వడ్లకు బోనస్ పెరగలేదని.. అక్కాచెల్లెళ్లకు రూ. 2500 రాలేదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలైనా పింఛన్ పెంచలేదని ధ్వజమెత్తారు. రూ. 2 లక్షల రుణమాఫీ చేయకుండా పార్లమెంటు ఎన్నికలకు వెళ్తే ప్రజలు ఓటు వేయరని కీలక వ్యాఖ్యలు చేసారు.
తాజావార్తలు
-
Konda Surekha: కొండా సురేఖకు మంత్రి పదవి నుంచి ఉద్వాసన.. కీలక పదవుల్లో కొత్త నియామకాలు.!
-
ED Raids: దక్షిణాదిలో 30 చోట్ల ఏకకాలంలో తనిఖీలు.. గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడీ సోదాలు.!
-
Kamal : సిద్ధా’ డైరెక్టర్‌తో కమల్ హాసన్ పవర్ ప్యాక్డ్ ప్రాజెక్ట్..
-
Whatsapp Update: ఇకపై వాట్సాప్ నుంచే కరెంట్, వాటర్ బిల్లులు.. 22 వేలకుపైగా బిల్లర్లతో సరికొత్త సేవలు.!
-
Yasha Nagula : యూట్యూబ్‌ను షేక్ చేసిన ‘యేషనాగుల’.. 5 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్!
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!