మంగళూరులో భజరంగ్ దళ్, వీహెచ్‌పీ సభ్యులు నిరసన చేపట్టారు. ఒక కాన్వెంట్ స్కూల్లో హిందూ దేవుళ్లను అవమానించడం, విద్యార్థులను మతం మార్చే ప్రయత్నం చేస్తున్నారనే సమాచారంతో విద్యార్థులతో కలిసి మితవాద సంఘాలు నిరసనలు చేపట్టారు. కాథలిక్ బాలికల పాఠశాల ఉపాధ్యాయుడు.. హిందూ దేవుళ్లను అవమానించడం, హిందూ మతానికి వ్యతిరేకంగా విద్యార్థుల మనస్సులను విషపూరితం చేయడం, ఇతర మతాలకు చెందిన విద్యార్థులను క్రైస్తవ మతంలోకి మార్చడానికి కుట్ర పన్నుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.
కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి మల్లు రవి. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ లో నీటి సమస్యలు చాలా కీలకమన్నారు. కృష్ణ జలాల గురించి అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా హాజరుకాకపోవడం ప్రజలను అవమనపరిచినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. కీలకమైన బడ్జెట్ సమావేశాలలో కేసీఆర్ రాకుండా బయట ఎక్కడో మాట్లాడ్డం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఎంత సేపు మాట్లాడిన అవకాశం ఇస్తామని చెప్తున్న…
ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు జరుపుకునే వాలెంటైన్స్ వీక్‌లో, ఫిబ్రవరి 12ని కిస్ డేగా జరుపుకుంటారు. ప్రేమను వ్యక్తీకరించడానికి ముద్దు ఉత్తమ మార్గం. దీని ద్వారా ఎదుటి వ్యక్తికి ఏమీ చెప్పకుండానే మీ ప్రేమను వ్యక్తపరచవచ్చు.
వైసీపీలో ఏడవ జాబితాపై కసరత్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో.. సీఎంవో నుంచి పిలుపు అందుకున్న నేతలు తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు ఎమ్మెల్యేలు, నేతలు క్యూ కడుతున్నారు. ఈరోజు సీఎంవో కార్యాలయానికి కొడాలి నాని, వల్లభనేని వంశీ, కర్నూలు నియోజకవర్గానికి చెందిన ఎస్వీ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు.
విశాఖ అభివృద్ధి చెందిన నగరంగా నీతి ఆయోగ్ రోడ్డు మ్యాప్ లో విశాఖకు స్థానం లభించిందని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ తెలిపారు. విశాఖ అభివృద్ధికి భారీగా నిధులు రాబోతున్నాయని.. గ్రోత్ హబ్ గా మారుతుందన్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు.. ఈనెల 15న వైజాగ్ లో నీతి ఆయోగ్ సమావేశం జరగనుందని చెప్పారు. ఇదిలా ఉంటే.. దేశ ప్రజలు మరోసారి మోదీ సర్కార్ కోరుకుంటున్నారని.. 404 సీట్లతో మూడోసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని జీవీఎల్ చెప్పారు.
అమరావతిలోని ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అయింది. పెండింగ్ డీఏ, ఏపీజీఎల్ఐ, ఐఆర్, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ ప్రక్రియ పూర్తిచేయడం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు పరిష్కారం తదితర అంశాలపై చర్చిస్తున్నారు. మరోవైపు.. ప్రభుత్వంతో చర్చలు ఫలించకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. దీంతో ఈ చర్చలపై ఉత్కంఠ నెలకొంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మనీష్ సిసోడియాకు స్వల్ప ఊరట లభించింది. తన మేనకోడలు వివాహానికి హాజరయ్యేందుకు ఢిల్లీ కోర్టు సోమవారం మనీష్ సిసోడియాకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
యాంటీబయాటిక్స్‌ను ఎక్కువగా వాడకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (టీఎస్‌డీసీఏ) సోమవారం సాధారణ ప్రజలకు ఒక సలహాలో స్పష్టం చేసింది. యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR) అభివృద్ధి చెందకుండా జాగ్రత్త వహించాలని , యాంటీబయాటిక్స్‌ను బాధ్యతాయుతంగా ఉపయోగించాలని TSDCA ప్రజలను కోరింది. “యాంటీబయాటిక్స్ తప్పుగా ఉపయోగించినప్పుడు, బ్యాక్టీరియా వాటిని చంపడానికి రూపొందించిన ‘యాంటీబయాటిక్స్’కు నిరోధకతను పొందడం ప్రారంభిస్తుంది. ఔషధ నిరోధకత ఫలితంగా, యాంటీబయాటిక్స్ అసమర్థంగా మారతాయి…
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఇంటి కూల్చివేత కేసులో మున్సిపల్ కార్పొరేషన్‌కు ఇండోర్ హైకోర్టు చురకలంటించింది. ఎవరి ఇంటినైనా కూల్చడం ఫ్యాషన్‌గా మారిందని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. దోషులకు కోర్టు జరిమానా కూడా విధించింది.
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తండ్రి అనిరుధ్ సింగ్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రవీంద్ర జడేజా, తన కోడలు రివాబాపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తన కొడుకు, కోడలితో చాలా కాలంగా దూరంగా ఉంటున్నానని.. సరైన సంబంధాలు లేవని చెప్పారు. తన కోడలు రివాబా తమ కుటుంబంలో చిచ్చు పెట్టిందని, ఆమె తమ ఇంట అడుగుపెట్టినప్పటి నుంచి తమ కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయని తెలిపారు. అంతేకాకుండా.. చాలా వ్యాఖ్యలు చేశారు. వాటిపై…