KCR : కృష్ణాజలాలు మన జీవన్మరణ సమస్య.. నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణాజలాలు మన జీవన్మరణ సమస్య అని, నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదన్నారు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేటీఆర్. ఇవాళ ఆయన నల్గొండలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ… గతంలో ఫ్లోరైడ్‌తో నల్గొండ జిల్లా వాసుల నడుములు వంగిపోయాయని, మా బతుకు ఇది అని చెప్పినా గతంలో ఏ పార్టీ పట్టించుకోలేదన్నారు. బీఆర్‌ఎస్ వచ్చాక నల్గొండను ఫ్లోరైడ్ రహితంగా చేశామన్నారు. భగీరథ నీళ్లతో ఫ్లోరైడ్ బాధలు పోయాయి. ఇది రాజకీయ సభ కాదు.. పోరాట సభ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పదేళ్లలో నేనేం తక్కువ చేయలేదని, ఎక్కడినుంచో కరెంట్ తెప్పించి విద్యుత్ కోతలు లేకుండా చేశామన్నారు కేసీఆర్. నా గడ్డ, నా ప్రజలు, నా ప్రాంతం అనుకుంటే ఏమైనా సాధించొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. గోదావరి, కృష్ణా కలిపి మంచిగా నీళ్లు తెచ్చుకున్నామని, బస్వాపూర్ పూర్తైందని, దిండి ప్రాజెక్ట్ పూర్తి కాబోతోందన్నారు. పాలమూరు ఎత్తిపోతల పూర్తైతే పాలమూరు, వికారాబాద్, రంగారెడ్డి ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన వెల్లడించారు.
INDIA bloc: ఢిల్లీలో ఒకటి మీకు, గుజరాత్‌లో 8 మాకు.. ఆప్-కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయతీ..
‘దద్దమ్మల రాజ్యం ఉంటే గట్లనే ఉంటది. చాతగాని చవటల రాజ్యం ఉంటే గట్లనే ఉంటది. వాళ్లు ఉన్నంత మాత్రాన మనం నర్వస్ కావొద్దు. ఎక్కడికక్కడ మనం నిలదీయాలి. ఏమైందిరా బిడ్డ నా కరెంటు అని అడగాలి. ఇవాళ నేను ఒక మాట కుల్లకుల్లగా చెబుతున్న. మొన్నటిదాకా నడిచిన కరెంటు కాకుండా.. ఇదే మిర్యాలగూడ నియోజకవర్గంలో దామరచర్ల మండలంలో 4వేల మెగాపవర్ ప్లాంట్ కట్టినం జగదీశ్‌రెడ్డి నాయకత్వంలో. 90శాతం పనులు పూర్తయ్యాయి. రెండుమూడు నెలలు తిప్పలుపడితే 4వేల మెగావాట్ల పవర్ వస్తుంది. రామగుండంలో ఆ నాడు మొదలుపెట్టిన ఎన్టీపీసీ 800 మెగావాట్ల పవర్ వచ్చింది. ఇంకో 800 మెగావాట్లు రాబోతున్నది. ఆ నాడు నడిపిన నాడు ఉన్నదాని కంటే 5600 మెగావాట్ల పవర్ కరెంటు ఎక్కువగ ఉండంగ కూడా.. వీళ్లకు ఏం రోగం పుట్టింది.. కరెంటు ఎందుకు ఇస్తలేరు ? ఎందుకు తిప్పలుపెడుతున్నరు ? బిడ్డా ఛలో నల్లగొండతోనే ఆపం. ఎక్కడ దొరికితే అక్కడ బజార్లలో నిలదీస్తాం’ అని కేసీఆర్ అన్నారు.
Also Read
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
- Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
Pakistan: పాక్ ఎన్నికలపై వివాదం.. రిగ్గింగ్ జరిగిందని దాఖలు చేసిన 30 పిటిషన్లు తిరస్కరణ
తాజావార్తలు
-
Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
-
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
-
Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
-
The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
-
Zelenskyy: కొత్త ప్రాంతీయ కూటమి ఏర్పాటు చేసిన జెలెన్స్కీ.. ఏఏ దేశాలున్నాయంటే..!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..