ప్రతి జంటకు ప్రేమికుల దినోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకోవాలని కోరుకుంటుంది. తద్వారా ఈ రోజు ఎప్పటికీ అందమైన జ్ఞాపకంగా మారుతుంది. వాలైంటైన్స్ డేను ఎలా జరుపుకోవాలో ChatGPTని అడిగినప్పుడు, ప్రేమ కోసం అంకితమైన రోజును జంటలు ఎలా జరుపుకోవచ్చో 10 పాయింట్లలో వివరించింది.
మాజీ మంత్రి అనిల్ కుమార్ మాటలు తగ్గించాలని వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. సంపాదన కోసం పదవులు కోసం అర్రులు చాచే మనస్తత్వం తనది కాదన్నారు. అధికారం ఉన్నప్పుడు విర్రవీగే, భజనలు చేసే మనస్తత్వం తనకు లేదని తెలిపారు. అనిల్ తో ఎవరు మాట్లాడిస్తున్నారో తనకు తెలుసని చెప్పారు. 2014లో తనను ఎవరు ఓడించారో కూడా తెలుసని పేర్కొన్నారు. ఆ విషయాలు తెలియక అనిల్ అజ్ఞానంతో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
కొత్త వ్యాధులు నిరంతరం పుట్టుకొస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులకు కారణమవుతున్నాయి. వ్యాధి నిజానికి, కెనాయి ద్వీపకల్పంలో అంటు వ్యాధితో ఒకరు మరణించిన వార్త వెలుగులోకి వచ్చింది.
తెలంగాణ అసెంబ్లీలో చర్చ వింటే ఏపీ అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో తెలుస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఏపీ రైతులకు జరిగిన మేలు తెలంగాణ అసెంబ్లీలో మంత్రులే చెబుతున్నారని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత నీరు నిలబెట్టారో, సీఎం వైఎస్ జగన్ దానికి రెట్టింపు నిలబెట్టారని తెలిపారు. టీడీపీ పతనావస్థకు చేరింది... ఇది ప్రారంభం మాత్రమేనని అన్నారు. టీడీపీ ఏమి చేసింది అని చెప్పుకునే పరిస్థితిలో కూడా లేదని దుయ్యబట్టారు.
విజయవాడలో బీజేపీ కిసాన్ మోర్చా రైతు గర్జన సభ నిర్వహించారు. ఈ సభకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, సత్యకుమార్, కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి రైతులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మాట్లాడుతూ.. రైతులను ఆపి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ పాలనపై ప్రజలు వ్యతిరేకత చూపిస్తున్నారని ఆరోపించారు. మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా.. 11 కోట్ల రైతన్నలకు డీబీటి ద్వారా మోదీ ఇస్తున్నారని…
మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 1961 తర్వాత రాష్ట్రంలోకి వచ్చి జీవానం సాగిస్తున్న వారందరినీ గుర్తించి పంపించి వేస్తామని వెల్లడించారు.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అశోక్ చవాన్ ఈరోజు బీజేపీలో చేరారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మహారాష్ట్ర బీజేపీ కార్యాలయానికి చేరుకున్న ఆయన.. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. నిన్న కాంగ్రెస్ కు రాజీనామాతో పాటు అసెంబ్లీ సభ్యత్వానికి చవాన్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ నుంచి బయటకు రావడం తన వ్యక్తిగత విషయమన్నారు. మరో రెండు రోజుల్లో తదుపరి నిర్ణయాలు తీసుకుంటానని…
ఫిబ్రవరి 7వ తేదీన ఉక్రెయిన్పై దాడి సమయంలో రష్యా హైపర్సోనిక్ జిర్కాన్ క్షిపణిని ప్రయోగించింది. కీవ్లోని శాస్త్రీయ పరిశోధనా సంస్థ ఫోరెన్సిక్ పరీక్షల అధిపతి సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్లోని తన కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ గారితో శాఖ పరమైన అంశాల పరిష్కారంపై సుదీర్ఘంగా చర్చించారు. సానుకూలంగా స్పందించారు. ఇటీవల కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై…
తెలంగాణ ఉద్యమం ఎప్పుడైనా కాంగ్రెస్ నేతలే చేశారని, కానీ కేసీఆర్ కుటుంబం.. సెంటిమెంట్ ని వాడుకున్నది.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు సీనియర్ కాంగ్రెస్ నేత కోదండరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు.. గ్యారంటీలు అమలు చేస్తాం అన్నామని ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామన్నారు. ధాన్యంకి ఐదు వందల బోనస్ ఎక్కడా..అని ఓ మాజీ మంత్రి అడుగుతున్నారన్నారు. 2600 క్విటాలుకు ధాన్యం అమ్ముతున్నారు రైతులు అని, Msp…