9 ఏండ్లు బీఆర్ఎస్ నేతల కంపును ఒక ఫినాయిల్ బాటిల్ సరిపోదన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ధరణి సమస్యలపై.. అప్పటి cs సోమేశ్ కి ఎంత చెప్పినా చెవిటోడి ముందు శంఖం ఊదినట్టు అయ్యిందన్నారు. ధరణి ఎత్తివేయాలని రాహుల్ గాంధీ చెప్పారన్నారు జగ్గారెడ్డి. రైతులకు మేలు జరగనిది ఎందుకు అని రాహుల్ గాంధీ రద్దు చేస్తాం అన్నారని ఆయన వ్యాఖ్యానించారు. కోదండరాం రైతుల సమస్యలపై ఎప్పుడూ తిరిగే వారని, ఫార్మా సిటీ.. భూములు సమస్యలన్నింటి పై…
ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రివర్గ ఉప సంఘం భేటీ ముగిసింది. కాగా.. మరోసారి భేటీకి నిర్ణయం తీసుకున్నారు. భేటీకి సంబంధించి తేదీ ఖరారు కాలేదు. ఈ సందర్భంగా మీటింగ్ వివరాలను మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఏపీజేఏసీ ప్రకటించిన ఆందోళనల గురించి తనకు తెలియదన్నారు. మార్చి నెలాఖరుకు ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.5 వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. మిగతా బకాయిలు జూన్ నెలాఖరు వరకు విడుదలకు హామీ ఇచ్చారు.…
నెయ్యిలోని పోషకాల గురించి అందరికీ తెలిసిందే.. నెయ్యిని తినాలంటే రోటీలో కానీ పప్పు అన్నంలో కానీ ఎక్కువగా తింటూ ఉంటారు. అంతేకాకుండా.. నెయ్యిని తీపి వంటకాలు, మసాల వంటకాలల్లో వాడుతారు. ఇక చిన్నపిల్లలకు నెయ్యి లేకుండా అన్నం పెట్టరు చాలా మంది. నెయ్యి తినడం వల్ల మన శరీరంలోని ఎముకలు, కండరాలు బలంగా ఉంటాయి. నెయ్యితో మీ చర్మాన్ని మెరిసేలా చేయడంలో కూడా సహాయపడుతుంది. అయితే నెయ్యి తినడమే కాకుండా ముక్కులో కూడా వేసుకోవచ్చు. ప్రతిరోజూ రాత్రి…
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిపై వైసీపీ ఇంఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. బాలాయపల్లి ఎంపీపీ పిలిస్తే మండల సమావేశానికి ఎమ్మెల్యే ఆనం వచ్చేస్తాడా? అని ప్రశ్నించారు. ఆనంవి సిగ్గులేని పనులు.. వైసీపీ నుంచి సస్పెండ్ చేసినా పిలవని పేరంటాలకు వచ్చేస్తాడని విమర్శించారు. కండలేరు జలాశయం నుంచి తెలుగుగంగ ద్వారా రైతులకు 200 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశామని తెలిపారు. 500 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని అనం అసంబద్ధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
పాకిస్తాన్లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండటం దాదాపు ఖాయమైంది. ఇమ్రాన్ ఖాన్ పార్టీ - పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) ప్రతిపక్షంలో కూర్చోనుంది. పాలక కూటమిలో నవాజ్ పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్), బిలావల్ భుట్టో జర్దారీకి చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ), ముత్తాహిదా క్వామీ మూవ్మెంట్ (ఎంక్యూఎం) ఉన్నాయి.
బీహార్ కొత్త స్పీకర్గా నంద కిషోర్ బీహార్ అసెంబ్లీలో (Bihar) సోమవారం జరిగిన బలపరీక్షలో నితీష్కుమార్ సర్కార్ (Nitish Kumar) విజయం సాధించింది. 129 మంది ఎమ్మెల్యేలు నితీష్కు మద్దతుగా నిలిచారు. ఇక కొత్త స్పీకర్గా బీజేపీ నేత నంద కిషోర్ యాదవ్ (Nand Kishore Yadav )పేరు ఖరారైంది. మంగళవారం ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే నితీష్ కుమార్ బలపరీక్షకు ముందు మహాకూటమిలో స్పీకర్గా ఉన్న ఆర్జేడీకి చెందిన అవథ్ బిహారీ చౌదరిపై అధికార…
నాగాలాండ్ పర్యాటక శాఖ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఆయన షేర్ చేసిన వీడియోలు యూజర్లకు బాగా నచ్చుతాయి. తాజాగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఓ బామ్మ అద్భుతంగా కారు డ్రైవింగ్ చేస్తోంది. వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమేనని ఈ బామ్మ మరోసారి నిరూపించిందని ట్వీట్ చేశాడు.
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకు మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. శ్రీనగర్ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు ఇదే కేసులో గత నెలలో సమన్లు అందాయి.
రెండేళ్ళకు ఒకసారి జరిగే ఆసియాలోనే అతి పెద్దదైన మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర 2024 సందర్భంగా డా. కేర్ హోమియోపతి యొక్క అన్ని తెలంగాణ బ్రాంచ్లలో ఉచితంగా యాంటీ-ఇన్ఫెక్షన్ పిల్స్ పంపిణీ రేపటి(మంగళవారం) నుంచి జరుగుతుంది.