భారత క్రికెట్లో విషాదం.. మాజీ కెప్టెన్ కన్నుమూత! భారత క్రికెట్లో విషాదం చోటు చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ దత్తాజీరావు గైక్వాడ్ కన్నుమూశారు. ఆయన వయసు 95 ఏళ్లు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో మంగళవారం తెల్లవారుజామున బరోడాలోని తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. గత 12 రోజులుగా ఐసీయులో ఉన్న దత్తాజీరావు ఈ తెల్లవారుజామున మరణించినట్లు కుటుంబ సభ్యులు పీటీఐకి తెలిపారు. భారత మాజీ ఓపెనర్, జాతీయ కోచ్ ఔన్షుమాన్ గైక్వాడ్ తండ్రే దత్తాజీరావు…
పైథాన్ అంటే అందరికీ భయమే.. దాన్ని చూడగానే కిందనుండి కారిపోతుంది. అది కాటు వేయకున్నా గానీ, చాలా ప్రమాదకరం. లైవ్‌లో గానీ, మ్యూజియంలో గానీ పైథాన్‌ను చూసినప్పుడు ఒళ్లు గగుర్పొడిస్తుంది. కానీ.. ఒక మహిళ మాత్రం తన చేతులతో భారీ కొండచిలువను ఎలా పట్టుకుందో చూస్తే షాకైపోతారు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఏ మాత్రం భయం లేకుండా కొండచిలువను పట్టుకుంది.
వాలెంటైన్స్ డే దగ్గర పడింది. ఈ సందర్భంగా, ఆన్లైన్ బహుమతుల నుంచి ఆన్లైన్ డేటింగ్ వరకు ప్రతిదీ పెరుగుతుంది. కానీ వాలెంటైన్స్ డే మీ ఆనందాన్ని నాశనం చేస్తుంది, ఎందుకంటే స్కామర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి యాక్టివ్‌గా. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఎవరు దొంగిలించగలరు.
కారుణ్య నియామకం కింద తెలంగాణా వాసులకు ఉద్దేశించిన ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిని నియమించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర శాసనమండలిలో ప్రత్యేక ప్రస్తావన సందర్భంగా ఆమె ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. స్థానికులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేందుకే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని, దాని ప్రకారం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చట్టాలు కూడా చేసిందన్నారు. అయితే, కొత్త కాంగ్రెస్…
విజయనగరంలోని జేఎన్టీయూ జీవీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2007లో ఈ ఇనిస్టిట్యూట్ వంద ఎకరాలతో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారని తెలిపారు. వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా ఇది తయారు కావాలన్నారు. ఇందుకోసం ఏం కావాలన్నా అడగొచ్చని చెప్పారు. ఇనిస్టిట్యూట్ ఏర్పాడు చేయడమే కాదు.. అక్కడ అన్ని వసతలు కల్పించాలని ప్రభుత్వం ఉద్దేశమని పేర్కొన్నారు. అలాగే పోటీ పరీక్షలో కూడా ముందుండాలని అనేక మార్పులు తీసుకొస్తున్నామని మంత్రి…
పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరిగి దాదాపు వారం రోజులు కావస్తున్నా ఆ దేశానికి కొత్త ప్రధాని ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. భవిష్యత్‌లో పాకిస్థాన్‌కు ఎవరు ప్రధానమంత్రి అయినా.. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయబోయే అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నూతన జాయింట్ డైరక్టర్ గా కె.అపూర్వ రావు (ఐపీఎస్) బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ బస్ భవన్ లోని తన ఛాంబర్ లో ఆమె మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. సీఐడీ, ఎస్పీగా విధులు నిర్వర్తిస్తోన్న అపూర్వరావుని టీఎస్ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్ గా ప్రభుత్వం సోమవారం నియమించింది. హైదరాబాద్ చెందిన ఆమె.. 2014 ఐపీఎస్ బ్యాచ్ అధికారిణి. వనపర్తి, గద్వాల, నల్లగొండ జిల్లాలకు ఎస్పీగా గతంలో పనిచేశారు. టీఎస్ఆర్టీసీకి జాయింట్ డైరెక్టర్…
ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 13 నుంచి 14 వరకు యూఏఈలో అధికారిక పర్యటనలో ఉన్నారు. దుబాయ్‌తో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన ఇక్కడ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. దీంతో పాటు అబుదాబిలో జరిగే కమ్యూనిటీ కార్యక్రమంలో ప్రధాని మోడీ భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
నల్ల చట్టాలు తెచ్చి రైతులను మోసం చేశారు మోడీ అని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి వ్యాఖ్యానించారు. రైతుల ఆందోళనతో వెనక్కి తీసుకుంటున్న అన్నారు కానీ ఇప్పటికీ మూడు పార్లమెంట్ సమావేశాలు జరిగాయన్నారు. కానీ బిల్లులు వెనక్కి తీసుకోలేదని, నల్ల చట్టాలు తో రైతులు భూములు కౌలు కి ఇవ్వాలి అంటా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కౌలు కి ఇచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి అనేది తెలియదని కోదండరెడ్డి మండిపడ్డారు. గోదాముల్లో నిల్వలు ఉండొద్దనే చట్టం…
కోవూరులో వైసీపీ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయన్నారు. 'సి' ఓటర్ సర్వేలో మాత్రం చంద్రబాబు అధికారంలోకి వస్తారని చెబుతోందని తెలిపారు. సి ఓటర్ సర్వే చంద్రబాబు చెంచా లాంటిదని దుయ్యబట్టారు.