చికెన్ ధర చూస్తే కెవ్వుమనాల్సిందే. అంతకంతకూ ధర కొండెక్కుతుంది. చికెన్ రేటు అమాంతం పెరగడంతో మాంసహార ప్రియులు గగ్గోలుపెడుతున్నారు. ఇప్పుడు చికెన్ తినాలంటే ఒక్కసారి పర్సు చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఓ వైపు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్, మరోవైపు కోళ్ల సరఫరా తగ్గడంతో ధరలు ఆల్ టైం రికార్డుకు చేరుకున్నాయి. దీంతో చికెన్ ధరలు పెరిగిపోతున్నాయి. కోడి ధరలు చూసి సామన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. ఒక్కరోజులోనే చికెన్ ధరలు ఆల్ టైం రికార్డుకు చేరుకున్నాయి. బుధ, గురు వారాల్లో రూ.150 నుంచి 200 ఉన్న కిలో లైవ్ కోడి.. నిన్న ధర అమాంతం పెరిగిపోయింది. కోళ్ల సరఫరా తగ్గడంతో వ్యాపారులు ధరలు పెంచేశారు. వినియోగదారుల అవసరం మేరకు ఉత్పత్తి లేకపోవడంతో కోడి మాంసం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. దీంతో మాంసహార ప్రియులు గగ్గోలుపెడుతున్నారు.
Read Also: Jaggareddy: బీఆర్ఎస్, బీజేపీ అవకాశవాద రాజకీయాలు చేస్తుంది..
ప్రస్తుతం స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.300పైనే ఉంది. బోన్ లెస్ చికెన్ రికార్డు స్థాయిలో కిలోకు రూ.500కు పైగా అమ్ముతున్నారు. ఓవైపు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్, మరోవైపు ఎండతీవ్రత ఎక్కువైతే చికెన్ ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. ఆదివారం వస్తే చాలు గ్రేటర్ హైదరాబాద్ వాసులకు ముక్కలేకపోతే ముద్దదిగదు. ఆదివారం సుమారు 12 లక్షల కిలోలు, మిగిలిన రోజుల్లో సుమారు 7 లక్షల వరకు చికెన్ విక్రయాలు జరుగుతుంటాయి. తాజాగా ధరల పెరుగుదలతో విక్రయాలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు.
Read Also: Telangana Media Academy: మీడియా అకాడమీ ఛైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి..