కాకినాడ జిల్లాలోని జగ్గంపేట టికెట్టు టిడిపికి కేటాయించడంపై జనసేన పార్టీలో అసంతృప్తి నెలకొంది . టిక్కెట్ ఆశించి భంగపడిన. జనసేన జగ్గంపేట ఇన్ ఛార్జీ పాఠం శెట్టి సూర్యచంద్ర అంతిమ నిరాహార దీక్షకు దిగారు. తనకు జనసేన నాయకత్వం జగ్గంపేట అసెంబ్లీ స్థానానికి టికెట్ కేటాయించకపోవడంతో తీవ్ర అసంతృప్తితో గోకవరం మండలం అచ్చుతాపురం గ్రామంలో ఉన్న దుర్గమ్మ ఆలయానికి చేరుకుని అంతిమ దీక్ష ప్రారంభించారు. పాఠం శెట్టి దంపతులు ఆలయంలోనే ఉండి దీక్ష కొనసాగిస్తున్నారు. . ప్రజలకు సేవ చేసినా, తమలాంటి వారిని అసెంబ్లీకి వెళ్లేందుకు జనసేన పార్టీ ప్రయత్నించకపోవడాన్ని నిరసిస్తూ ఆలయంలోనే దీక్ష కొనసాగిస్తున్నారు. మరోవైపు తాము ఆమరణ దీక్ష చేపట్టినా, జనసేన- టిడిపి నాయకత్వాన్ని గెలిపించాలని కేడర్కు చెబుతున్నారు. పాఠం శెట్టి అభిమానులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తెల్లవారుజాము వరకు ఆలయం వద్దే ఉంటూ పాఠం శెట్టికి మద్దతుగా నిలిచారు.
MLA Chinarajappa : MLA చినరాజప్ప కారు ప్రమాదం.. వీడియో వైరల్
ఇదిలా ఉంటే.. కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం జనసేన కార్యకర్తలలో అసమ్మతి సెగ రగులుతోంది. పెడన ఎమ్మెల్యే సీటు జనసేనకి కేటాయించకపోవడంతో జనసేన క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉంది. పెడన సీటు గురించి పవన్కళ్యాణ్ పునరాలోచన చేయాలని, పెడన నియోజకవర్గంలో ముందు నుండి పోరాడింది జనసేననేనని జనసైనికులు గళం వినిపిస్తున్నారు. సాక్షాత్తు జనసేనాని పవన్ కళ్యాణ్ పెడన సీటు జనసేనకి దక్కుతుందని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే.. వారాహి యాత్ర పెడన నియోజకవర్గ పరిధిలో జరిగినప్పుడే క్యాడర్ బలంగా పెడన సీటు మనదే అని ఫిక్స్ అయ్యారు. గౌరవప్రదమైన పొత్తుకు విఘాతం కలిగినట్టుగా జనసైనికులు భావిస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా అధికారానికి దూరమైన పెడన నియోజకవర్గం లోని ఒక బలమైన సామాజిక వర్గం టికెట్ ఆశిస్తుంది. జనసేన ద్వారా ఆ కల నెరవేరుతుందని అనుకోవడం జరిగింది. పరిస్థితి తారుమారు కావడంతో దిక్కు తోచని స్థితిలో ఆ సామాజిక వర్గం ఉంది. సీటు బీసీ సామాజిక వర్గానికి ఇవ్వటాన్ని మేము అందరం ఆనందిస్తామని, కానీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మెజార్టీ సామాజిక వర్గాన్ని విస్మరించడం సరైన పద్ధతి కాదు కదా అని అక్కడి నేతలు అంటున్నారు. జనసేన-టీడీపీ పొత్తులో భాగంగా 24 స్థానాలని జనసేనకి కేటాయించడం మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచిందని, పవన్ కళ్యాణ్ 175 స్థానాల్లో మూడో వంతు పోటీ చేస్తామని అనేక సందర్భాల్లో తెలియజేశారని జనసైనికులు వ్యాఖ్యానించారు.
UP : కౌశాంబిలోని బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి, పలువురి పరిస్థితి విషమం