రష్యా-ఉక్రెయిన్ వార్లో 23 ఏళ్ల భారతీయుడు మరణించాడు. ఈ 23 ఏళ్ల యువకుడు గుజరాత్కు చెందిన హేమిల్ అశ్విన్‌భాయ్‌గా గుర్తించారు. రష్యా సైన్యంలో సెక్యూరిటీ హెల్పర్‌గా చేరాడు. ఈనెల 21న ఉక్రెయిన్ వైమానిక దాడిలో మరణించాడని దాడి నుంచి తప్పించుకున్న మరో భారతీయ ఉద్యోగి తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ సరిహద్దులోని డొనెస్క్ ప్రాంతంలో హేమిల్ పనిచేస్తున్నప్పుడు ఉక్రెయిన్ దాడులు జరిగాయని చెప్పారు.
మరోవైపు.. హేమిల్ మరణంపై తమకు ఎలాంటి సమాచారం లేదని భారత విదేశీ వ్యవహరాల శాఖ స్పష్టం చేసింది. ఓ నివేదిక ప్రకారం.. సూరత్ జిల్లాకు చెందిన హేమిల్ అశ్విన్‌భాయ్ 2023 డిసెంబర్ లో రష్యా సైన్యంలో చేరారు. ఈ నెల ప్రారంభంలో, హామిల్ తండ్రి అతన్ని స్వదేశానికి తీసుకురావడంలో సహాయం కోరుతూ భారత కాన్సులేట్‌కు లేఖ రాశారు. రష్యా సైన్యంతో ఒప్పందంపై ఉన్న పలువురు భారతీయులు కూడా రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. కాగా.. ఫిబ్రవరి 20న హామిల్‌తో మాట్లాడినట్లు హామిల్ తండ్రి చెప్పారు.
Read Also: Chandrababu : తొలి విడత ప్రకటించిన అభ్యర్థులతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్
ఈ ఘటన గురించి కర్ణాటకకు చెందిన సమీర్ అహ్మద్ మాట్లాడుతూ.. మరో ఇద్దరు భారతీయ యువకులతో కలిసి సెంట్రీ డ్యూటీ చేస్తున్నాడు. ఇంతలో బాంబు పడడంతో దగ్గర్లోని కందకంలో దాక్కున్నట్లు సమీర్ చెప్పాడు. కాసేపటి తర్వాత వెళ్లి చూడగా.. హేమిల్ రక్తపు మడుగులో పడి ఉన్నాడని తెలిపాడు. హేమిల్ మృతదేహాన్ని వ్యాన్ లోకి ఎక్కించి అక్కడి నుంచి పంపించేశారని చెప్పుకొచ్చాడు.
ఇటీవలి కాలంలో.. నేపాల్, భారతదేశం నుండి కొంతమంది రష్యా సైన్యంలో చేరినట్లు చెప్పబడిన అనేక నివేదికలు వచ్చాయి. ఒక నివేదిక ప్రకారం, 100 మందికి పైగా భారతీయ యువకులు రష్యా సైన్యంలో చేరారు. వీరిలో ఎక్కువ మందిని రష్యా ఆర్మీ 100 మంది భారతీయులను సెక్యూరిటీ హెల్పర్లుగా నియమించింది. అయితే వీరందరూ యుద్ధం నుంచి దూరంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక అడ్వైజరీ కూడా చేసింది. ఏజెంట్ల మోసం వల్లే భారత యువకులు రష్యాలో సెక్యూరిటీ హెల్పర్లుగా పనిచేయాల్సి వస్తోందని ఇటీవల ఎంఐఎం చీఫ్, అసదుద్దీనన్ ఒవైసీ ఆరోపించిన విషయం తెలిసిందే. వీరి విషయంలో భారత విదేశాంగ శాఖ వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. .