నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్లుగా ప్రగ్యా జైస్వాల్ తో పాటు శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతెలా హీరోయిన్లుగా నటించారు. బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ నిర్వహించింది సినిమా యూనిట్. ఈ సందర్భంగా దర్శకుడు బాబీ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Read Also: AP Govt: భవన నిర్మాణాలు, లేఔట్లకు అనుమతులు మున్సిపాలిటీలకు అప్పగింత..
ఈ రోజు ఉదయం థియేటర్లో విజిట్ కి వెళ్ళినప్పుడు సౌండ్ కి భలే ఎక్సైటింగ్ అనిపించిందని సినిమా చూసిన అందరూ విజువల్స్ గురించి కూడా మాట్లాడడం ఆనందం కలిగిస్తోందని అన్నారు. సినిమా టీం అంతా రెండేళ్ల పాటు పడిన కష్టం ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తుందని ఆయన అన్నారు. అంతేగాక ఆయన మాట్లాడుతూ తమన్ ఇచ్చిన వార్నింగ్ దెబ్బకు చాలా చోట్ల సౌండ్ తగ్గించి పెడుతున్నట్లు తనకు కంప్లైంట్స్ వస్తున్నాయని అయితే ఆ విషయంలో కేర్ తీసుకోవాలని అన్నారు. నిజానికి అంత సౌండ్ పెట్టినా పగిలిపోవు, ఫుల్ సౌండ్ పెట్టండి అని ఆయన ధియేటర్ల యాజమాన్యాన్ని కోరారు.
Read Also: Sonu Sood : ఇద్దరు స్టార్ హీరోల గుట్టు రట్టు చేసిన సోనూ సూద్