బీజేపీ విజయ సంకల్ప యాత్రలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే సనత్ నగర్, ఎర్రగడ్డ మీదుగా నేడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అమీట్ పేట్ లో మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో మళ్లీ మోదీ మళ్ళీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విజయ సంకల్ప యాత్ర పేరుతో రాష్ట్రంలో 5 యాత్రలను ప్రారంభించడం జరిగిందని, ఈ రోజు విజయ సంకల్ప యాత్రలో భాగంగా సనత్ నగర్‌కు రావడం జరిగిందన్నారు కిషన్ రెడ్డి. ఎవరూ ప్రధాని కావాలి? ఏ ప్రభుత్వం కేంద్రంలో రావాలనేది ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయని, మూడో సారి మోడీ ప్రధాని కావాలని దేశ ప్రజలు అకాక్షింస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. మోడీ పాలనలో అనేక సంస్కరణలు జరిగాయని, రాష్ట్రంలో కూడా బేగంపేట రైల్వే స్టెషన్ పునరుద్దరణ పనులకు మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారన్నారు.
అంతేకాకుండా.. ‘సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్దరణ కార్యక్రమాన్ని స్వయంగా మోదీ ప్రారంభించారు. 20 శాతం పనులు కూడా పూర్తి అయ్యాయి. నాంపల్లి రైల్వే స్టేషన్‌ను రూ. 350 కోట్లు, కాచిగూడ రైల్వే స్టేషన్‌ను 450 కోట్లతో పునరుద్దరణ చేస్తున్నాం. అన్ని రంగాలలో దేశం అభివృద్ది చెందుతుంది. మోడీ భారతదేశ ప్రతిష్టను పెంచారు. గతంలో హైదరాబాద్‌లో అనేక చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. గత పదేళ్లుగా దేశం ప్రశాంతంగా ఉందంటే అది మోదీ చాతుర్యమే. బాంబు పేలుళ్లు, మత కలహాలు, ఐఎస్ఐ కార్యకలాపాలు, కిడ్నాప్‌లు లేవని, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచి వేశారు మోడీ. దేశంలో ఎక్కడ కూడా పాకిస్థాన్ ISS కార్యకలాపాలు లేవు. జమ్ము కాశ్మీర్‌లో నేడు జాతీయ జెండా శాంతియుత వాతావరణంలో రెపరెపలాడుతోంది.
అయోధ్యలో రామమందిరం నిర్మించి 500 ఏళ్ల కలను నెరవేర్చారు మోడీ. ఆయనే లేకుంటే అయోధ్యలో రామాలయ నిర్మాణం జరిగేది కాదు. కరోనా లాంటి ఘోర విపత్తును సమర్ధవంతంగా మోడీ ఎదుర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్‌ను దేశ ప్రజలకు ఉచితంగా అందించారు. మోడీ గారి నాయకత్వం వైపు ప్రపంచ దేశాలు చేస్తున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మోదీని ఆశీర్వదించాలి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు.. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క ఎంపీ సీటు గెలవకున్న నష్టం లేదు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం తెలంగాణను అనేక విధాలుగా దోచుకుంది. ఇక కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా రావు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కాంగ్రెస్ నేతలే నమ్మడం లేదు. రాహుల్ గాంధీ ఎంపీ ఎన్నికల తర్వాత విదేశాలకు వెళ్లిపోతారు. మోడీతోనే దేశం సుభిక్షంగా ఉంటుంది. లోక్‌సభ స్థానాల్లో భాజపా అభ్యర్థులను గెలిపించి ప్రధాని మోడీకి బహుమతిగా ఇవ్వాలి. ఈ ఎన్నికల్లో మోదీని ఆశీర్వదించండి. మీ బంధువులతో కలిసి మోడీకి ఓటు వేయించండి.’ అని ఆయన వ్యాఖ్యానించారు.