పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీలో వర్గపోరు రాజుకుంది. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుపై మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు మండిపడ్డారు. భీమవరంలోని మాజీ ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు.. సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో.. ఎన్నికల్లో ఏ మాత్రం సహకరించేది లేదంటూ స్పష్టం చేశారు. దీంతో పార్టీ ఆఫీసు నుంచి రామరాజును శివ వర్గం బయటకి పంపించింది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు వ్యతిరేకంగా శివవర్గం నినాదాలు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన నాటి నుంచి రెవెన్యూ, ఇరిగేషన్, ఐటీ, పరిశ్రమల శాఖలో అక్రమాలు జరిగాయని ఎన్నో కథనాలు వచ్చాయన్నారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం తో అవినీతి పెరిగిపోతోందని, కాంగ్రెస్ ఇన్చార్జి ల పై ఎన్నో ఆరోపణలు ఉన్నాయన్నారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. మాణిక్ రావు ఠాక్రే, ఠాగూర్ లపై ఆధారాలు ఉన్నాయని చెప్పారన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఎవ్వరిపై కూడా…
మగవారు ఎక్కువగా కండల కోసం జిమ్లో వర్కౌట్లు, జాగింగ్లు చేస్తుంటారు. అంతేకాకుండా.. శరీరానికి బలానిచ్చే ఆహారపదార్థాలు తీసుకుంటారు. అయితే ఓ యువకుడు మాత్రం బాడీ బిల్డిండ్ కోసమని నాణాలు, అయస్కాంతాలు మింగాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. శరీరానికి జింక్ అవరసరమని చిల్లర నాణాలను మింగేశాడు. అయితే.. అలా మింగిన తర్వాత వాంతులు, కడుపులో నొప్పితో సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరాడు. దీంతో వైద్యులు స్కానింగ్ తీయగా.. అతని కడుపులో నాణాలు చూసి…
కెనడాలో గత ఏడాది భారత దౌత్యా అధికారులకు వరుసగా బెదిరింపులు వచ్చాయని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చెప్పుకొచ్చారు. అదే టైంలో ఆ దేశ వ్యవస్థల నుంచి ఎలాంటి సహకారం లభించలేదు అని పేర్కొన్నారు.
ఈజిప్టు రాజధాని కైరో శివారులో నైలు నదిలో ఓ ఫెర్రీ బోటు మునిగిపోవడంతో 19 మంది కూలీలు మరణించారు. గ్రేటర్ కైరోలో భాగమైన గిజాలోని మోన్షాత్ ఎల్ కాంటేర్ పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే, ఈ ప్రమాదంలో 19 మంది వరకు చనిపోయినట్లు తెలుస్తుంది.
హైదరాబాద్లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. విజయ సంకల్ప యాత్రకు ముఖ్య అతిథిగా వచ్చిన గుజరాత్ ముఖ్యమంత్రి బుపెంద్ర భాయ్ పాటిల్ కి ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఏప్రిల్ మొదటి వారం లో ఎన్నికలు జరుగనున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరైతే దేశాన్ని ముందుకు తీసుకుపోతుందో.. ఎవరి నేతృత్వంలో అవినీతి రహిత దేశం ఏర్పడుతుందో ఆలోచించి ఓటు వేయాలని ప్రజల్ని కోరుతున్నానన్నారు.
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. మంగళవారం వైసీపీ కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యనేతలను సమాయత్తం చేసేందుకు వైసీపీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన తాడేపల్లి సీకే కన్వెన్షన్లో ఈ మీటింగ్ జరగనుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నేతలు హాజరు కానున్నారు. సుమారు 2 వేలకు పైగా మండల స్థాయి…
సింగరేణి సంస్థల్లో పని చేసే 43 వేల మందికి ప్రమాద వశాత్తు ఏదైనా జరిగితే కోటి రూపాయల భీమా వర్తించే పథకమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సంక్షేమ రాజ్యానికి సాక్ష్యం ఇది అని ఆయన వ్యాఖ్యానించారు. ఆరు గ్యారెంటీలతో పాటు సింగరేణి కార్మికులకు ఇన్సూరెన్స్ ఇస్తున్నామన్నారు. కార్మికులను కాపాడుకోవడం మా భాద్యత అని ఆయన అన్నారు. అవుట్ సోర్సింగ్ కార్మికుల కు కూడా 20 నుంచి 30 లక్షల ఇన్సూరెన్స్ చేయించామన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి…
మహారాష్ట్రలో పుణెలోని పింప్రి చించ్వాడ్ ప్రాంతంలో ఓ వ్యక్తి 8 ఏళ్ల బాలుడిని వడపావ్తో ప్రలోభపెట్టి లైంగిక వేధింపులకు గురి చేసి హత్య చేసినట్లు పోలీసు అధికారి సోమవారం తెలిపారు.