ఎల్‌ఆర్‌ఎస్‌పై ఇచ్చిన జీవో లు రెండు కూడా గత ప్రభుత్వం ఇచ్చినవే కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడే ఇచ్చిన జీవో లోనే ధరలు నిర్ణయించారని, అనధికార లే అవుట్లు అన్ని.. చెరువులు..అసైన్డ్ భూములు.. ప్రభుత్వ భూములు అక్రమించి చేసినవే అని ఆయన అన్నారు. అక్రమ లే అవుట్లు జరుగుతుంటే మీరు నిద్ర పోయారా.. లేకుంటే మీ నాయకులకు దోచుకోండి అని అనుమతి ఇచ్చారా..? అని కోదండరెడ్డి ప్రశ్నించారు. ఎందుకు కంట్రోల్ చేయలేదని ఆయన అన్నారు. కొన్న వాళ్ళ పై మాకు సింపతి ఉందని, అమాయక ప్రజల నుండి డబ్బులు లాక్కునే పని చేసింది కేటీఆర్ అని ఆయన మండిపడ్డారు. ఇప్పుడేమో ఉచితంగా రెగ్యులర్ చేయండి అని నీతి మాటలు చెప్తున్నారన్నారు. పేదలకు హోసింగ్ బోర్డ్ ద్వారా ఇండ్లు ఇచ్చింది మేము అన్నారు.
అంతేకాకుండా..’కోకాపేట లో ప్రభుత్వ భూమి పేదలకు ఇచ్చింది కాంగ్రెస్. కానీ పేదల భూములు లాక్కుని పెద్ద బిల్డర్ లకు ఇచ్చారు కేసీఆర్. . అధికారం పోగానే నీతి మాటలు చెప్తున్నారు. చాలా చోట్ల షికం భూములు కూడా కబ్జా చేశారు. తగుదునమ్మ అని ఇప్పుడు ధర్నా లు చేస్తున్నారు brs వాళ్ళు. హెచ్‌ఎండీఏలో చేసిన లేఅవుట్ల పైనా విచారణ జరపాలి. అమాయక ప్రజల దగ్గర డబ్బులు లాక్కున్న వారిపై చర్యలు తీసుకోవాలి. ఔటర్ రింగ్ రోడ్డును ప్రయివేటు కంపెనీకి అప్పగించావు. నీ జీవితం అంతా.. నిర్వకమె చేశారు. 111 జీవో పరిధిలో కూడా భూములు అక్రమించారు. FTIలో కూడా మీ భూములు ఉన్నాయి. వీటన్నిటి పై విచారణ జరపాలి. ప్రభుత్వం చర్యలు తీలుకోవాలి. అధికారం పోయిన తెల్లారి నుండే రోడ్డు ఎక్కడం ఇక్కడే చూశా. పుక్కిడికీ మంత్రులు అయ్యారు. బరితెగించి సంపాదన చేసిన మిపై చర్యలు తీసుకోవాలి.’ అని కోదండరెడ్డి వ్యాఖ్యానించారు.