మంత్రి కొండా సురేఖ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ సమక్షంలో 11 మంది వరంగల్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీ లను నమ్మి కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ ను, కొండా దంపతులను నమ్మి కాంగ్రెస్ పార్టీ లో జాయిన్ అవుతామన్న వాళ్ళను brs నాయకులు చంపుతామని బెదిరిస్తున్నారన్నారు. ఆరు గ్యారంటీ లను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు నమ్మకం కల్పించాలని, మూడు సంత్సరాలుగా పైసా పనిచేయలేకపోయామని కార్పొరేటర్లు బాధ పడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని, పోటీ పడి పని చేయాలన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు గెలిచేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండ ఉంటదన్నారు. బీఆర్‌ఎస్‌లో చేసిన తప్పులు ఇక్కడ చేయకుండా చూసుకోండని, అందరు ఒక కుటుంబం లాగా కలిసి పనిచేసి ప్రభుత్వాన్ని ముందుకు నడపాలన్నారు మంత్రి కొండా సురేఖ.
Duddilla Sridhar Babu : కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే జవాబుదారి తనం