నేడు సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. పటేల్ గూడలోని SR ఇన్ఫినిటీ లో జరిగే బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ పాల్గొనున్నారు. సభా వేదికగా 9021 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు వర్చువల్ గా ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. సంగారెడ్డి లో 1409 కోట్లతో నిర్మించిన NH-161 నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోడీ. సంగారెడ్డి X రోడ్డు నుంచి మదీనగూడ వరకు 1298 కోట్లతో…
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటితో 5వరోజుకు చేరుకున్నాయి.
గత ఐదు నెలలుగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంపై ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ స్పందించారు. గాజా పరిస్థితిపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల మరణాలను కూడా ఆమె తీవ్రంగా ఖండించారు. దాదాపు ఐదు నెలలుగా గాజాలో జరుగుతున్న యుద్ధంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రుచిరా కాంబోజ్ తెలిపారు.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 9.10 గంటలకు సీఎం జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి విశాఖకు చేరుకుంటారు. రాడిసన్ బ్లూలో నిర్వహిస్తున్న ‘విజన్..విశాఖ’ సదస్సులో పాల్గొని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమవుతారు. మధ్యాహ్నం 12.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుంటారు. అక్కడ స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశమవుతారు. పారిశ్రామిక…
ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని ఎన్నికల కమిషన్‌కు ఇవ్వడానికి జూన్ 30 వరకు సమయం కావాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును కోరింది. ఫిబ్రవరి 15న ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌ను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంలో, మార్చి 6లోగా ఎన్నికల కమిషన్‌కు జారీ చేసిన ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని అందించాలని ఎస్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.
1. నేడు పశుసంవర్థకశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. మధ్యాహ్నం సెక్రటేరియట్లో అధికారులతో సీఎం సమావేశం. 2. నేడు సాయంత్రం యూపీలో మంత్రి వర్గ విస్తరణ. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్న దారాసింగ్, ఓం ప్రకాష్. ఆర్ఎలడీ నుంచి రాజ్‌పాల్‌కు మంత్రి పదవి. 3. నేడు విజయవాడకు మానవ హక్కుల కమిషన్. కమిషన్ చైర్పర్సన్ అరుణ్ మిశ్రాతో పాటు కమిషన్ సభ్యుల పర్యటన. ఫిర్యాదులపై రేపు విచారణ చేయనున్న కమిషన్? 4. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10…
భారత్‌లో నిరుద్యోగం పాకిస్థాన్‌లో కంటే ఎక్కువగా ఉందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సోమవారం ఎదురుదాడి చేసింది. దీనితో పాటు, పొరుగు దేశానికి కాంగ్రెస్ ఎందుకు మద్దతు ఇస్తుందనే ప్రశ్న కూడా ఆ పార్టీ లేవనెత్తింది.
ప్రముఖ మహానంది క్షేత్రంలో 6 నుండి 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ప్రతిరోజు అభిషేకాలు, విశేష పూజలు, వాహన సేవలు నిర్వహించనున్నారు. 8వ తేదీ రాత్రి 10 గంటలకు లింగోద్భవ కాలంలో మహా రుద్రాభిషేకం చేపట్టనున్నారు.
వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన పర్వతగిరి మండలం మోత్య తండాలో జరిగింది. విద్యుత్ షాక్ కు గురైన వారిలో మొత్తం నలుగురు యువకులు ఉన్నారు. కాగా.. మొదటగా భూక్యా దేవేందర్ అక్కడికక్కడే మృతి చెందగా.. గాయాలతో ఉన్న సునీల్, రవిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. జేపీ నడ్డా 13 రోజుల క్రితం (ఫిబ్రవరి 20వ) తేదీన గుజరాత్ నుండి రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జేపీ నడ్డా ఇంతకుముందు హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.