కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల విధుల్లో 1.5 కోట్ల మంది ఉద్యోగులు పాల్గొననున్నారని ఈసీ వెల్లడించింది.
ఏపీతో పాటు తెలంగాణలో ఒకేరోజు ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలతో పాటు ఇటీవల కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత చనిపోయిన సంగతి తెలిసిందే. దాంతో అక్కడి స్థానం ఖాళీ కాగా.. ఆ అసెంబ్లీ స్థానానికి కూడా మే 13న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
భారత వాతావరణ శాఖ (IMD) దేశంలోని అనేక ప్రాంతాలకు వర్షపాత హెచ్చరిక జారీ చేసింది, ఇది మార్చి 16 నుండి ప్రారంభమై మార్చి 21, 2024 వరకు కొనసాగుతుంది. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, సిక్కిం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం మరియు త్రిపుర రాష్ట్రాలు దీని ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇంకా, జమ్మూ మరియు కాశ్మీర్ మరియు లడఖ్లలో కూడా మార్చి 20 మరియు…
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. మే 13న అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్ సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను సీఈసీ విడుదల చేసింది. ఈసీ ప్రకటనతో రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
ముషీరాబాద్ అసెంబ్లీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పర్యటించారు. ఈ సందర్భంగా “లబ్ధిదారుల సమవృద్ది – మోడీ గ్యారెంటీ” కార్యక్రమంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో గాంధీ నగర్ లో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధి దారులను ఇంటింటికీ వెళ్లి కలుస్తూ ‘మోడీ గ్యారెంటీ’ గురించి వివరించారు. ఈ నేపథ్యంలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి పనులు, సాధించిన విజయాలతో పాటు పలు సంక్షేమ పథకాలు అందించిందన్నారు. ముఖ్యంగా బడుగు బలహీన…
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్.. చేనేతల బీసీ నేత డాక్టర్ మాచాని సోమనాథ్ కు కేటాయించాలని బీసీ, చేనేత నాయకులు కోరుతున్నారు. ఈ క్రమంలో.. ఎమ్మిగనూరు పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి పద్మశ్రీ మాచాని సోమప్ప విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ ర్యాలీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పాకిస్తాన్ వాతావరణాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాలలో క్రేయేట్ చేశారన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. ఇవాళ ఆయన ఆర్మూరులో మాట్లాడుతూ.. ముస్లింలతో కలిసి ప్రధాని మోడీని హేళన చేసి మాట్లాదారని ఆయన మండిపడ్డారు. హిందూ వ్యతిరేకి జీవన్ రెడ్డి అని, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అండతోనే పిఎఫ్ఐకి జగిత్యాల అడ్డా గా మారిందని ఆయన ఆరోపించారు. హిందూ వ్యతిరేక శక్తి గా తయారయ్యారని, రోహింగ్యాలకు పౌరసత్వం ఇవ్వాలని జీవన్ రెడ్డి పోరాడటం విడ్డూరమన్నారు ఎంపీ అరవింద్. స్వాతంత్య్రం…
ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ విభజన ఏపీ విభజన చట్టం-2014 నియమనిబంధనలకు అనుగుణంగా పూర్తయినట్టు రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇరు రాష్ట్రాలకు పంపిన లేఖను ఆయన మీడియాకు విడుదల చేశారు. రెండు రాష్ట్రాల నడుమ ఆస్తుల పంపకంలో భాగంగా ఆప్షన్-జీ కి ఇరు రాష్టాలు అంగీకారం తెలపడంతో విభజన పూర్తయినట్టు కేంద్రం ఈ లేఖలో తెలిపింది.
లోక్‌సభ ఎన్నికల ముందు మధ్యప్రదేశ్‌లో భారతీయ జనతాపార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు అజయ్ ప్రతాప్ సింగ్ పార్టీకి రాజీనామా చేస్తున్టన్లు ప్రకటించారు.