కరీంనగర్‌లోని మమత థియేటర్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ‘‘రజాకార్’’ సినిమాను వీక్షించారు. ‘‘రజాకార్’’ సినిమా నిర్మాత గూడూరు నారాయణరెడ్డి, డైరెక్టర్ యాట సత్యనారాయణ, సినీ నటులు రాజ్ అర్జున్ (మెయిన్ యాక్టర్), బలగం సంజయ్, గిరి, కాస్ట్యూమ్ డిజైనర్ పూజ(కరీంనగర్) తదితరులు సైతం ఈరోజు బండి సంజయ్ తో కలిసి సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కొంతమంది కూహన సెక్యులర్ వాదులు తెలంగాణ చరిత్రని మరుగున…
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ముంబాయి వెళ్లాల్సిన ఇండిగో విమానం (6E5099) ఆలస్యం అయింది. మధ్యాహ్నం 2:30 గంటలకు ముంబై వెళ్లాల్సిన విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. విమానంలోని ఇంజన్ లో ఓవర్ హీట్ సమస్య రావడంతో ఏసీ సమస్య మొదలై.. విమానం అలస్యం అయింది.
Imran Khan: ఫిబ్రవరిలో దాయాది దేశం పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల ఓటమి కోసం చాలా చోట్ల రిగ్గింగ్‌కి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే, తాజాగా వీటిపై ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం)లు ఉంటే రిగ్గింగ్ సమస్యల్నీ గంటలో పరిష్కారమయ్యేవని ఆయన అన్నారు. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్ అడియాలా జైలులో మీడియాతో…
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. సుమారు 3353 గ్రాముల బంగారాన్ని సీజ్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. సీజ్ చేసిన బంగారం విలువ రూ.1.92 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. విదేశీ ప్రయాణీకులు బంగారాన్ని పేస్టుగా మార్చి లగేజ్ బ్యాగ్ లో దాచి పట్టుకొస్తుండగా తనిఖీలు చేపట్టడంతో బట్టబయలైంది. దుబాయ్ నుండి తీసుకొచ్చిన బంగారాన్ని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని వాష్ రూమ్ వద్ద మరో వ్యక్తికి అప్పగిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ తేదీని మారుస్తూ భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రెండు రాష్ట్రాల్లో జూన్ 2న కౌంటింగ్ నిర్వహిస్తామని ఈసీ వెల్లడించింది.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇతర పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆరూరి పార్టీ వీడకుండా.. బీఆర్ఎస్ సీనియర్ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నిన్న బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు.…
వీధికుక్కలు సైరవిహారం చేస్తున్నాయి. మనుషులు కనిపిస్తే చాలు ఎక్కడ పడితే అక్కడ కండలు పీకేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై కుక్కల దాడులు ఎక్కువైపోయాయి. హైదరాబాద్ నగరంలోని ప్రజలపై కుక్కుల దాడి మరీ ఎక్కువైంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ సంఘటన శామీర్ పేట అద్రాస్ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
ఏపీలో గ్రూప్-1 పరీక్ష ప్రశాంతంగా ప్రారంభం కాగా.. ఓ వ్యక్తి కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. ఒంగోలు క్విస్ ఇంజినీరింగ్ కళాశాల పరీక్షా కేంద్రంలో కాపీ చేస్తూ ఓ అభ్యర్థి పట్టుబడ్డాడు. పరీక్షా కేంద్రంలో సెల్‌ఫోన్‌తో ప్రవేశించిన అభ్యర్థిని కాపీ చేస్తుండగా ఇన్విజిలేటర్ పట్టుకున్నారు.
విశాఖలో ఉత్తరాంధ్ర వైసీపీ న్యాయ విభాగం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి బొత్స సత్యన్నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది IB సిలబస్ తో ఫస్ట్ క్లాస్ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కోసం అప్పులు చేశామని ఆయన అన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ రాకుండా వుండాలంటే మరోసారి వైసీపీ అధికారం చేపట్టాలని, ప్రతిపక్షాలు గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించి ప్రభుత్వం ను ఇబ్బందులు పెట్టే…
రాష్ట్ర వ్యాప్తంగా ఎపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాతంగా జరుగుతోంది. విజయవాడ లోని ఎపీపీఎస్సీ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతర పర్యవేక్షిస్తున్నారు అధికారులు. పరీక్ష జరుగుతోన్న తీరును ఎపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ పరిశీలింలించారు. ఈ సందర్భంగా ఎపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. ఈ సారి అత్యధికంగా 1.48 లక్షల మంది అప్లై చేశారని, 18 జిల్లాలో 301 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్వామన్నారు. ఇవాల్టి పరీక్షలో 72.3 శాతం హాజరు నమోదైందని ఆయన…