ఓ క్రికెటర్.. ఓ సినిమా హీరోపై పొగడ్తల జల్లు కురిపించారు. తాజాగా రిలీజైన ఆ సినిమా.. ప్రేక్షకులను ఆకట్టుకోనప్పటికీ, సినిమాలో మాత్రం హీరో యాక్షన్ చాలా మందిని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆ సినిమాలో చేసిన డ్యాన్స్ వేరే లెవల్ అంటున్నారు. ఇంతకీ ఏ సినిమా అనుకుంటున్నారా.. అదేనండీ. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా.. పెద్దగా ఆడనప్పటికీ, తొందర్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఇకపోతే త్వరలో టీవీలో కూడా ఈ సినిమా రానుంది. అయితే.. ఈ సినిమాలో నటించిన సూపర్ స్టార్ మహేష్ బాబుపై టీమిండియా స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ పొగడ్తల వర్షం కురింపించారు.
Read Also: Supreme Court: రామ్‌దేవ్‌బాబాకు సుప్రీంకోర్టు సమన్లు.. దేనికోసమంటే..!
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న క్రికెటర్ అశ్విన్.. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా గురించి మాట్లాడారు. ఆ సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అశ్విన్ చెప్పారు. అంతేకాకుండా.. మహేష్ బాబు అద్భుతమైన డ్యాన్సర్ అని అన్నారు. కుర్చీ మడతపెట్టి సాంగ్‌కు తమిళ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారన్నాడు. ఆ సినిమాలో హీరోయిన్ శ్రీలల తోడైందని చెప్పుకొచ్చారు. ఈ మూవీలో వచ్చే కుర్చీమడతపెట్టి సాంగ్‌కు నెట్టింట వేల సంఖ్యలో రీల్స్ చేశారని తెలిసిందే. చీరకట్టులో, మోడ్రన్ డ్రెస్సులలో అమ్మాయిలు కుర్చీమడతపెట్టి సాంగ్‌కు ఇరగదీసే ఊరమాస్ స్టెప్పులేస్తూ దుమ్ముదులిపేసిన వీడియోలు ఇప్పటికే నెట్టింటిని షేక్ చేస్తున్నాయి.
Read Also: Australia Cricket: ఆఫ్ఘాన్‌తో టీ20 సిరీస్ క్యాన్సిల్ చేసుకున్న ఆసీస్.. కారణమదే..!
ఇక.. అంతకుముందు ఒకసారి హనుమ విహారి, అశ్విన్ ఇన్ స్టా గ్రామ్ లైవ్ లో తెలుగు సినిమాల గురించి చర్చించారు. 2020లో జరిగిన వీరి సంభాషణలో తెలుగులో మీకు ఎక్కువగా నచ్చిన సినిమా ఏంటని విహారి అడగగా.. మగధీర అని చెప్పుకొచ్చాడు అశ్విన్. అంతేకాకుండా.. తమ ఫ్యామిలీ ఎక్కువగా తెలుగు సినిమాలు చూస్తారని అన్నాడు. అంతేకాదు.. మహేష్ బాబు నటించిన పోకిరీ సినిమా ఇష్టం అని కూడా చెప్పాడు. తాజాగా గుంటూరు కారంలో మహేష్ బాబు డ్యాన్స్ పై మరోసారి సూపర్ స్టార్ పేరును తలుచుకున్నాడు.
Ravichandran Ashwin about #GunturKaaram #MaheshBabu pic.twitter.com/jxPcpGupmL
— NEWS3PEOPLE (@news3people) March 19, 2024