ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ సమర్పించేందుకు బీఆర్ఎస్ సిద్దమైంది. అందుకోసమని.. స్పీకర్ ను కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరారు. దీంతో స్పీకర్ సాయంత్రం 6 గంటలకు అపాయింట్మెం
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి చెండాలమైన పనులు అనే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని దుయ్యబట్టారు. పార్టీలు మారితే రాళ్లతో కొట్టాలన్న రేవంత్.. ఇప్పుడు తన పార్టీలోనే జాయిన్ చేసుకుంటున్నాడని విమర్శించారు. గతంలో చట్టబద్దంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల ఇంటి ఎదుట చావు డప్పు కొట్టిన రేవంత్.. ఇపుడు ఇలా చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు.
ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ఈ క్రమంలో నేతలు ఘాటు వ్యాఖ్యులు చేస్తున్నారు. ఈ సారి గెలుపు వైసీదేనని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
చిలకలూరిపేటలో ప్రజాగళం పేరుతో నిర్వహించిన సభలో ప్రధాని ఏదైనా వాగ్దానం చేశారా అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేకంగా కేంద్రం ఏం న్యాయం చేసిందంటూ ఆయన ప్రశ్నలు గుప్పించారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే ఏపీకి ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీలు ఇచ్చారు.. అంతేకానీ ప్రత్యేకంగా ఏమి ఇచ్చారంటూ ప్రశ్నించారు.
ఢిల్లీ ఈడీ కార్యాలయంలో కవిత మొదటి రోజు విచారణ పూర్తి అయింది. విచారణ సందర్భంగా ఈడీ అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు. విచారణ తర్వాత కవితను ఆమె భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, బావ హరీశ్ రావు కలిశారు. కవిత యోగ, క్షేమాలను వీరు కనుక్కున్నారు. ఈ కేసులో న్యాయపోరాటం చేద్దామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా న్యాయవాది మోహిత్ రావు కూడా కవితను కలిశారు. ఇదిలా ఉంటే.. రేపు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత భర్త కంటెంప్ట్…
గత ఎన్నికల్లో గోశామహల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుండి ఒక నార్త్ ఇండియన్కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని తమ అధినేత కేసీఆర్ నిర్ణయించారని... ఆ నిర్ణయం మేరకే నంద కిషోర్ వ్యాస్ ( బిలాల్ ) కు టికెట్ కేటాయించారని గోశామహల్ బీఆర్ఎస్ నాయకుడు ఎమ్.ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రచారంలో కూడా కేటీఆర్ రెండు సార్లు నియోజకవర్గంలో ప్రచారం చేశరని గుర్తు చేశారు. అయితే నందు బిలాల్ అసమర్థత వల్ల గెలిచే సీటు ఓడిపోవాల్సి వచ్చిందన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చేయడం కోసం ప్రజలు అనేక త్యాగాలు చేశారు.. అనేక బలి దానాలు త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ మొదటి పది సంవత్సారాలు కేసీఆర్ చేతిలో బంది అయ్యిందని ఆరోపించారు. అరాచకాలకు తెలంగాణ సమాజం ఏ రకంగా ఇబ్బంది పడిందో అందరికీ తెలుసు.. ధర్నా చౌక్ లో ధర్నా చేయడానికి కూడా అవకాశం లేకుండా చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం గజ్జె…
ఏపీలో గెలుపు ఎన్డీయేదేనని ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కన్నారు. కూటమికి మోడీ అండ ఉందన్నారు. మోడీ క్రమశిక్షణను చూసి అందరూ నేర్చుకోవాలన్నారు. మూడు పార్టీల జెండాలు వేరు కానీ, మా అజెండా ఒకటేనన్నారు. ఏపీ కోసం మూడు పార్టీలు జట్టు కట్టాయన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే మా అజెండా అని పేర్కొన్నారు. ఇది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సభ అని ఆయన తెలిపారు. మోడీ అంటే భవిష్యత్, మోడీ అంటే ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసమని…
టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో ప్రజాగళం బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ప్రధాని మోడీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధి లేక అప్పులతో నలుగుతోందని ఆరోపించారు. దాష్టీకాలతో ఏపీ ఇబ్బందులు పడుతోందని తెలిపారు. ఇలాంటి సందర్భంలో ఏపీకి మోడీ రాక ఆనందాన్ని కలిగించిందని అన్నారు. ప్రధానిగా మోడీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు.
'ప్రజాగళం' సభ యావత్ ప్రాంగణం పెమ్మసాని ప్రభంజనంతో మార్మోగింది. స్వాగత సన్నాహక ఏర్పాట్లలో భాగంగా ఉంచిన ఫ్లెక్సీలు, తోరణాలతో పాటు కటౌట్లు సభ వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కోరుతూ టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ఆధ్వర్యంలో 'ప్రజాగళం' భారీ బహిరంగ సభను చిలకలూరిపేట వద్ద గల బొప్పూడి ప్రాంతంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.