Live-In Partner: ఇటీవల కాలంలో లివ్ ఇన్ రిలేషన్లో ఉంటున్న వారు తమ భాగస్వాములను కిరాకతంగా హత్య చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. గురుగ్రామ్ సమీపంలోని చౌమా గ్రామంలో ఓ నిర్మాణంలో ఉన్న ఇంట్లో మహిళ శవమై కనిపించింది. ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తి హత్య చేసినట్లు గురుగ్రామ్ పోలీసులు వెల్లడించారు. శనివారం నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణలో లలన్ యాదవ్(35) అనే నిందితుడు మద్యం మత్తులో మహిళను హత్య చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు…
వైసీపీ మేనిఫెస్టో రూపకల్పన తుది దశకు చేరుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 20న సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేస్తారని తెలిపాయి. ఇవాళ 175 అసెంబ్లీ, 24 ఎంపీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడటంతో ప్రచారం ప్రారంభించేందుకు YCP రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది.
Viral Video: క్లాస్ రూపంలో మహిళా టీచర్ బాలీవుడ్ ఐటమ్ సాంగ్‌కి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. విద్యార్థులు ప్రోత్సహిస్తుంటే ఆమె డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘‘బంటీ ఔర్ బబ్లీ’’ సినిమాలో ఐశ్వర్యారాయ్ డ్యాన్స్ చేసిన కజ్రారే పాటకు సదరు ఉపాధ్యాయురాలు చిందులేసింది.
విశాఖలో నిర్వహించిన న్యాయ సాధన సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, సీపీఐ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ కు నలుగురు పాడేకట్టారని ఆరోపించారు. ఆ పాపంలో మోడీ, చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ ఉన్నారని తెలిపారు. ఉక్కును అమ్మకానికి పెడితే అడ్డుకోలేని వీళ్ళందరినీ ఉరితీయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో…
తాను హెడ్లైన్ల కోసం పని చేయనని, డెడ్లైన్ల కోసం పని చేస్తానని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్ 2024లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ కాంక్లేవ్‌లో మోడీ వ్యాఖ్యలు.. సుదీర్ఘకాలం పాటు కష్టపడి పనిచేయాలనే తన ఉత్సాహాన్ని చాటాయి.
పార్టీ అధినాయకత్వం ఏం చెబితే అది చేస్తానని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు తెలిపారు. పార్టీ అప్పజెప్పిన బాధ్యతలను నెరవేరుస్తా.. పార్టీ ఏం నిర్ణయం తీసుకున్నా దాన్ని అంగీకరించాలని చంద్రబాబు చెప్పారు.. తాను సరేనన్నానని పేర్కొన్నారు. చీపురుపల్లా ఎంపీనా.. లేక ఎచ్చెర్ల అనేది కాదు.. ఏం చెబితే అది చేస్తానన్నారు. రాజకీయాల్లో ఎప్పుడూ కొన్ని శక్తులు ఉంటాయి.. దాని గురించి తానేం మాట్లాడనని తెలిపారు. ఓసారి ముందు ప్రకటించొచ్చు.. ఓసారి చివర్లో ప్రకటన రావచ్చని…
ఏపీతో పాటు ఆ నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడంటే? దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) వెల్లడించింది. మొత్తం నాలుగు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జూన్ 4న నిర్వహించనున్నారు. ఏప్రిల్ 19 నుంచి లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలకు ఏకకాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 175 మంది సభ్యులున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మే 13న…
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారతదేశం అనేక సమస్యలలో పాలుపంచుకుంది. ఆ దేశాల్లో నిరంతరం ఉద్రిక్తతలను తగ్గించడంలో నిమగ్నమై ఉంది. ఇజ్రాయెల్‌పై రష్యా అణు దాడిని ప్రధాని నరేంద్ర మోడీ నివారించారా? అనే ప్రశ్నకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సమాధానమిచ్చారు.
విశాఖలో న్యాయ సాధన సభ నిర్వహించారు. ఈ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ పెత్తందార్లు వచ్చి తెలుగు గడ్డ మీద ఇటుక ముక్క కూడా తీసుకుని వెళ్ళలేరని విమర్శించారు. విశాఖ ఉక్కును ఎవరు టచ్ చేయలేరని అన్నారు. వైఎస్సార్ సంకల్పం నిలబెట్టిన వాళ్ళే వారసులు.. అందుకు విరుద్ధంగా వ్యవహరించే వాళ్ళు ఏ విధంగా వారసులు అవుతారో చెప్పాలని పేర్కొన్నారు. మరోవైపు.. రాజధాని ఎక్కడో చెప్పలేని పరిస్థితి రాష్ట్రానికి…
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ హాజరయ్యారు. నాంపల్లిలో ఏర్పాటు చేసిన నూతన హైదరాబద్ పార్లమెంట్ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ఆయన ప్రారంభించారు.. అనంతరం హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొంపల్ల మాధవీలత, డా. లక్ష్మణ్ ఎంపీని శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. మొదటి జాబితాలోని హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మాధవిలతను ప్రకటించారని, ఈ సారి హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో సంచలనమైన…