బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతి బా పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్ హాజరై.. మహాత్మా జ్యోతి బా పూలే చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ..
మహాత్మా జ్యోతి బా పూలే ఆశయాలకు అనుగుణంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పదేళ్లుగా సామాజిక న్యాయాన్ని మోదీ అమలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మహాత్మా జ్యోతి బా పూలే స్ఫూర్తి తీసుకుని అభినవ మహాత్మా జ్యోతి బా పూలేగా మోడీ కీర్తించబడుతున్నారని, కేంద్ర మంత్రి వర్గంలో బీసీలకు పెద్దపీఠ వేశారన్నారు. విద్య, ఉద్యోగ కల్పనతో పాటు పారిశ్రామిక వెత్తలుగా తయారు చేశారని, లోక్ సభ లో 85 మంది బీసీలకు అవకాశం కల్పించామన్నారు ఎంపీ లక్ష్మణ్. రాహుల్ గాంధీ బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలన్నారు. కాంగ్రెస్ హయాంలో బిసిలను అణిచి వేశారని, అంబేడ్కర్ ను రెండు సార్లు ఓడించి చట్ట సభలకు రాకుండా అడ్డుకున్నారన్నారు ఎంపీ లక్ష్మణ్.
అంతేకాకుండా.. బీసీల హక్కులను హరించింది జవహర్ లాల్ నెహ్రూ. నరేంద్ర మోడీని కులం పేరుతో అవమానిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలు ఉన్నాయని.. జూన్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ముస్లింలను బీసీల జాబితాలో చేర్చి.. బీసీల హక్కులను కాలరాస్తున్నారు. బీసీలంతా మోదీకి అండగా నిలబడుతున్నారు.. కాబట్టి మూడోసారి ప్రధాని కావడం ఖాయం. ముస్లిం సమాజానికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ముషీరాబాద్ అసెంబ్లీ పరిధిలోని ముషీరాబాద్ డివిజన్, గాంధీ నగర్ డివిజన్ లో నిర్వహించిన మహాత్మా జ్యోతి బాపులే జయంతి వేడుకల్లో రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. జ్యోతి బాపూలే చిత్ర పటానికి పూలు వేసి అక్కడ ఏర్పాటు చేసిన ఆన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘కర్పూరీ ఠాకూర్ కి భారత రత్న ఇచ్చింది మోది ప్రభుత్వం.. రైతు నాయకుడు చరణ్ సింగ్ కి సైతం భారత రత్న ఇవ్వడం మోదీ గొప్ప తనం.. బీసీల అభివృద్ధికి మోది ప్రభుత్వం కృషి చేస్తుంది.. వెనుక బడిన వారి కోసం పని చేసేవాల్లె నాయకులు అవుతారు.. రాహుల్ గాంధీ బీసీ ల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారు.. 55 ఏళ్లు పాలించి బీసీ గణాంకాలు చేయనందుకు రాహుల్ గాంధీ బీసీ లకు క్షమాపణ చెప్పాలి.. రాజకీయ లబ్ది కోసం పార్లమెంట్ ఎన్నికల వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని రేవంత్ రెడ్డి అంటున్నాడు.. మొదట రాష్ట్రం బీసీల గణాంకాలు చేసి 44% బీసీలకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.. లేదంటే బి.అర్.ఎస్ కి పట్టిన గతే రేవంత్ సర్కార్ కి పడుతుంది..’ అని లక్ష్మణ్ అన్నారు.