టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ టీమ్ను ఎంపిక చేశారు. వాస్తవానికి.. ఐపీఎల్ ముగియగానే, వెస్టిండీస్-అమెరికాలో టీ20 ప్రపంచకప్ ఉండనుంది. అందుకోసం ఏప్రిల్ నెలాఖరులోగా టీమిండియాను ఎంపిక చేయనున్నారు. 2013 తర్వాత టీమిండియా.. ఐసీసీ ట్రోఫీ ఒక్కటి కూడా అందుకోలేదు. ఈ క్రమంలో.. ఈ ట్రోఫీని సొంతం చేసుకోవడానికి టీమిండియా ఉవ్విళ్లూరుతుంది. అందుకోసం.. టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రదర్శన చూపించి.. టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కించుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో.. టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ భారీ జోస్యం చెప్పారు. అతను టోర్నమెంట్ కోసం 15 మంది సభ్యుల భారత జట్టును ఎంపిక చేశారు.
Tragedy: పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా అనంతలోకాలకు.. అన్న ఇద్దరు చెల్లెల్లు మృతి
కాగా.. భారత జట్టులో కనీసం 10 నుంచి 12 మంది ఆటగాళ్లకు చోటు ఖాయమైంది. అయితే.. మహమ్మద్ కైఫ్ తన జట్టును స్టార్ స్పోర్ట్స్ షో ‘ఫాలో ది బ్లూస్’లో టీ20 ప్రపంచ కప్ కోసం 15 మంది ఆటగాళ్ల గురించి చెప్పారు. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌కు మాత్రమే చోటు కల్పించాడు. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌లకు చోటు ఇవ్వలేదు. నాలుగో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కు అవకాశం ఇచ్చాడు. మరోవైపు.. రింకూ సింగ్ స్థానంలో ఫినిషర్ పాత్రలో రియాన్ పరాగ్‌ని ఎంచుకున్నారు.
TDP Chief: అమరావతి నిర్మించింది.. ఆంధ్రాకు సాప్ట్వేర్ను పరిచయం చేసింది.. అందుకోసమే..!
బ్యాటింగ్ ఆర్డర్ గురించి కైఫ్ మాట్లాడుతూ.. “రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేస్తాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 3వ స్థానంలో, సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో, హార్దిక్ పాండ్యా 5వ స్థానంలో, రిషబ్ పంత్ 6వ స్థానంలో ఉంటారు. బ్యాటింగ్‌లో డెప్త్ అవసరం కాబట్టి తాను చాలా మంది ఆల్‌రౌండర్లను ఉంచుతానని తెలిపారు. కాబట్టి అక్షర్ పటేల్ 7వ స్థానంలో, రవీంద్ర జడేజా 8వ స్థానంలో ఉంటారని చెప్పారు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ 9వ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ ఉంటారని” కైఫ్ తెలిపారు.