Dimuth Karunaratne: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ బ్యాటర్..
- అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన దిముత్ కరుణరత్నే
- 36 సంవత్సరాల వయస్సులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
- ఫిబ్రవరి 6 నుండి గాలెలో ఆస్ట్రేలియాతో శ్రీలకం రెండో టెస్ట్
- ఈ మ్యాచ్ అనంతరం రిటైర్ కానున్న కరుణరత్నే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంక దిగ్గజ బ్యాట్స్‌మన్, మాజీ కెప్టెన్ దిముత్ కరుణరత్నే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. 36 సంవత్సరాల వయస్సులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఫిబ్రవరి 6 నుండి గాలెలో ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్ట్ తర్వాత అతను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కానున్నాడు. ఈ మ్యాచ్ అతని 100వ టెస్ట్‌గా, క్రికెట్‌లో ఒక ప్రత్యేక మైలురాయిగా నిలుస్తుంది. క్రిక్‌బజ్‌లోని ఒక నివేదిక ప్రకారం.. ఇటీవల అనుకున్నంత స్థాయిలో బ్యాటింగ్‌లో కరుణరత్నే రాణించలేదు. ఈ క్రమంలో రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కరుణరత్నే తన చివరి ఏడు టెస్టుల్లో 182 పరుగులు మాత్రమే చేశాడు. దేశీయ క్రికెట్‌లో కూడా ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు. దీంతో.. యంగ్ ప్లేయర్స్‌కు అవకాశం ఇవ్వాలని అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.
Read Also: Champions Trophy 2025: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్.. నిమిషాల్లోనే టికెట్లు ఖతం
Also Read
- TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- AP Model Code of Conduct: ఏపీలో అమల్లోకి ఎన్నికల కోడ్.. కొత్త పథకాలు, ప్రాజెక్టులకు బ్రేక్.. నిబంధనలు ఇవే..
- Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
2012లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో దిముత్ కరుణరత్నే తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లోని మొదటి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సున్నా, రెండో ఇన్నింగ్స్‌లో 60 నాటౌట్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో శ్రీలంక 10 వికెట్ల తేడాతో గెలిచింది. ఇప్పటివరకు ఆడిన 99 టెస్ట్ మ్యాచ్‌ల్లో కరుణరత్నే 16 టెస్ట్ సెంచరీలతో మొత్తం 7,172 పరుగులు సాధించాడు. 2021లో అతను బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీ సాధించాడు. టెస్ట్‌లో అతని అత్యధిక స్కోరు 244.
దిముత్ కరుణరత్నే టెస్ట్ క్రికెట్‌లో శ్రీలంక తరఫున నిలకడగా ఆడాడు. శ్రీలంక తరపున 50 వన్డేలు, 34 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. శ్రీలంక తరఫున టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కరుణరత్నే నాల్గవ స్థానంలో ఉంటాడు. అతని కంటే ముందు కుమార్ సంగక్కర (12400), మహేల జయవర్ధనే (11814), ఏంజెలో మాథ్యూస్ (8090) ఉన్నారు.
తాజావార్తలు
-
Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
-
Railway Bonus: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, సామాజిక పింఛన్లకు రూ.53,428 కోట్లు!
-
TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
-
Tollywood: దసరా వార్‌లో నైజాంను క్లీన్ స్వీప్ చేసిన మైత్రీ!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..