Sword Dance : వినాయక నిమజ్జనంలో తల్వార్లతో యువకుల హల్చల్.. ఖమ్మంలో కలకలం.!
- నిమజ్జన ఊరేగింపులో తల్వార్లతో యువకుల హంగామా
- వైరల్గా మారిన కత్తులతో డ్యాన్సుల వీడియో
- నిబంధనలు ఉల్లంఘించారంటూ స్థానికుల ఆగ్రహం
- పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sword Dance : ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పువ్వాడ నగర్లో వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా తీవ్ర కలకలం రేగింది. గణేష్ నిమజ్జన ఊరేగింపులో కొందరు యువకులు బహిరంగంగా తల్వార్లు, పెద్ద పెద్ద కత్తులు చేతబూని రోడ్లపై హల్చల్ చేశారు. ప్రజాభద్రతను గాలికి వదిలేసి, చేతుల్లో పదునైన ఆయుధాలు పట్టుకుని గట్టిగా కేకలు వేస్తూ భయాందోళనకర వాతావరణాన్ని సృష్టించారు.
సోషల్ మీడియాలో వీడియో వైరల్.. స్థానికుల్లో భయం
పెద్ద ఎత్తున కత్తులు తిప్పుతూ, నృత్యాలు చేస్తూ రోడ్లపై సంచరించిన ఈ దృశ్యాలను కొందరు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్త వేగంగా వైరల్గా మారాయి. పదునైన తల్వార్లను ప్రదర్శిస్తూ యువకులు చేసిన ఈ చర్యలతో స్థానిక నివాసితులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆధ్యాత్మిక ఉత్సవాల పేరిట ఇలా బహిరంగంగా ఆయుధాలతో హంగామా చేయడం ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చిపెట్టేలా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
నిబంధనల ఉల్లంఘనపై ఆగ్రహం.. పోలీసుల తీరుపై ప్రశ్నలు
నిమజ్జన సమయంలో డీజేల వినియోగానికి ఎటువంటి అనుమతి లేకపోయినప్పటికీ, అక్కడ యథేచ్ఛగా డీజేలు మోగిస్తూ ఊరేగింపు నిర్వహించడంపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పటికీ, అంతటి పెద్ద సౌండ్ సిస్టమ్లు , పదునైన ఆయుధాలతో యువకులు స్వేచ్ఛగా రోడ్లపైకి వస్తుంటే రఘునాథపాలెం పోలీసులు పట్టనట్లు వ్యవహరించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైరల్ అయిన వీడియో ఆధారంగా పోలీసులు తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని, నిబంధనలను ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!