AP Weather: ఏపీలో భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. రేపు 58 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 148 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఎల్లుండి 51 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 111 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(58):
శ్రీకాకుళం 17 , విజయనగరం 21, పార్వతీపురంమన్యం 12 , అల్లూరి 6, ఏలూరు1, తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(148) :-
శ్రీకాకుళం 12, విజయనగరం 5, పార్వతీపురంమన్యం 3, అల్లూరిసీతారామరాజు7, విశాఖపట్నం3, అనకాపల్లి 18, కాకినాడ 14, కోనసీమ 8, తూర్పుగోదావరి 18, పశ్చిమగోదావరి 3, ఏలూరు 10, కృష్ణా 5, ఎన్టీఆర్ 5, గుంటూరు 6, పల్నాడు 11, ప్రకాశం 12, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు1, శ్రీ సత్యసాయి 3, అన్నమయ్య 1, తిరుపతి 3 మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
శనివారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.9 డిగ్రీలు,(ఈ సంవత్సరం అధిక ఉష్ణోగ్రత) తిరుపతి జిల్లా రేణిగుంటలో 45.7, వైయస్సార్ జిల్లా ఖాజీపేట, పార్వతీపురంమన్యం జిల్లా సాలూరులో 45.7, విజయనగరం జిల్లా గజపతినగరం, కర్నూలు జిల్లా కోడుమూరులో 44.8, అనంతపురం జిల్లా తాడిపత్రిలో 44.4, శ్రీకాకుళం జిల్లా బూర్జ, పల్నాడు జిల్లా మాచెర్లలో 44.2, ఏలూరు జిల్లా దెందులూరులో 44., అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం లో 44 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. అలాగే 77 మండలాల్లో తీవ్రవడగాల్పులు,98 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు. ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.