విశాఖ తీరంలో తొ లిసారిగా ప్రైవేటు క్రూయిజ్ షిప్ లంగరు వేసింది. సుమారు 200 మందితో MS ది వరల్డ్ పోర్టు సిటీకి చేరుకుంది. ప్రపంచ దేశాలు తిరిగే హాబీ వున్న ఫార్నర్స్ ఈ క్రూయిజ్ ను ఎంగేజ్ చేసుకుంటారు. అమెరికాలో బయలు దేరిన ఈ ప్రయివేట్ క్రూయిజ్ రెండు రోజుల పాటు విశాఖలో ఉండనుంది. రెండేళ్ల క్రితం విశాఖకు క్రూజ్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. కార్డోలియో ఎంప్రస్ నౌక విశాఖ – పుదుచ్చేరి – చెన్నయ్ మధ్య…
స్లీప్ విడాకులు అంటే ఏమిటి : మీరు విడాకుల గురించి చాలా విన్నారు, కానీ మీరు ‘స్లీప్ డివోర్స్’ పేరు విన్నారా? ఈ ధోరణి ప్రపంచంలోని చాలా దేశాలలో ఆచరణలో ప్రారంభమైంది. ఇది సమీప భవిష్యత్తులో భారతదేశంలో ప్రజాదరణ పొందే అవకాశం ఉంది. ‘నిద్ర విడాకులు’ గురించి వివరంగా తెలుసుకుందాం. ‘నిద్ర విడాకులు’ అంటే ఏమిటి? ‘ : స్లీపింగ్ విడాకులు’ అంటే దంపతులు విడిపోవడం లేదా విడాకుల ప్రక్రియ ద్వారా వెళ్లరు, కానీ ఒకే ఇంట్లో…
రాష్ట్రంలోనే 45 డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్న తొలి ప్రదేశంగా నంద్యాల అవతరించడంతో ఆంధ్రప్రదేశ్లో శనివారం ఎండలు ఠారెత్తించాయి. ఈ తీవ్రమైన వేడి రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది నివాసితులు ఇంటి లోపల ఆశ్రయం పొందవలసి వచ్చింది. తెలుగురాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణశాఖ. మరో 3 రోజులపాటు ఎండలు మండిపోతున్నాయని హెచ్చరించింది ఐఎండీ.. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండ వేడికి జనాలు ఒక్కరి బిక్కిరి అవుతున్నారు. ఏప్రిల్ నెల నుంచి కొన్ని జిల్లాల్లో 40 నుంచి…
నేడు కస్గంజ్లో అమిత్ షా, బరేలీలో సీఎం యోగి పర్యటన.. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ సీనియర్ నేతలు ఇవాళ (ఆదివారం) కూడా తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాస్గంజ్, మెయిన్పురి, ఇటావాలో నిర్వహించే బహిరంగ సభలలో పాల్గొననున్నారు. ఆ తర్వాత సాయంత్రం కాన్పూర్లోని తిలక్ నగర్ ప్రాంతంలో బీజేపీ సంస్థాగత సమావేశంలో ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. రాజధానిలో దారుణ హత్య.. దుకాణం పైకప్పుపై…
ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. పిఠాపురం నుంచి పోటీ చేస్తు్న్న జనసేనాని పవన్ కల్యాణ్ నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పవన కల్యాణ్ నేడు తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో నిర్వహించనున్న సభల్లో పాల్గొంటారు. అయితే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 29వ తేదీ సోమవారం తాడేపల్లిగూడెంలో జనసేన అధినేత పవన్కల్యాణ్ పర్యటన ఉంటుందని విజయవంతం చేయాలని నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ…
నేడు కర్నూలు జిల్లాలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లోని ప్రచారంలో చంద్రబాబు పాల్గొంటారు. మంత్రాలయం, కొడుమూరు సెగ్మెంట్లో ప్రజాగళం నిర్వహిస్తారు. అలాగే కౌతాలం, గూడూరు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు చంద్రబాబు. ఈ రోజు సాయంత్రం 3.50 గంటలకు నెల్లూరు నుంచి కౌతాలంకు వస్తారు. రాత్రి గూడూరులోనే బస చేస్తారు చంద్రబాబు. కాగా చంద్రబాబు నాయుడు సోమవారం నందికొట్కూరులో పర్యటించనున్నారని ఆ పార్టీ నంద్యాల లోక్సభ నియోజకవర్గ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి అన్నారు. శనివారం…
కాకినాడ లోక్ సభ ఎన్నికలు రంజుగా మారనున్నాయి. ఎన్నికల్లో గెలుపుకోసం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజం. కానీ ఈ సారి కాకినాడ లోక్ సభ ఎన్నికల్లో విమర్శల వేడి మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కేంద్ర బిందువుగా కూటమి తరఫున జనసేన కాకినాడ లోక్ సభ అభ్యర్థిగా పోటీచేస్తున్న తంగేల ఉదయ్ శ్రీనివాస్ అంశం కాబోతోంది. తాజాగా ఆయన చదవుతోపాటు విదేశాల్లో ఆయనపై నమోదైన కేసు అంశం ఈ ఎన్నికల్లో రాజకీయ వేడిమరింత పెంచే…
నేటి నుంచి సీఎం జగన్ మలిదశ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. తాడిపత్రి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు సీఎం జగన్. మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత తొలిసారి జనంలోకి జగన్ వస్తున్నారు. ప్రతి రోజూ మూడు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు.. ఈ నేపథ్యంలోనే.. ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో జగన్ బహిరంగ సభలో పాల్గొంటారు.. అలాగే. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతి జిల్లా వెంకటగిరిలో సభలో.. మధ్యాహ్నం 3 గంటలకు కందుకూరులో సభకు హాజరుకానున్నారు జగన్.…